‘అర్ధ హలాసనం’తో ఈ సమస్యలకు చెక్!

56
- Advertisement -

మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకునేందుకు ప్రతిరోజూ వ్యాయామం, యోగా వంటి ఫిట్ నెస్ కార్యకలాపాలు చేస్తూ ఉంటారు చాలామంది. అయితే వ్యాయామం సంగతి అలా ఉంచితే.. యోగా మాత్రం మహిళలు, పురుషులు, పిల్లలు, వృద్దులు ఇలా ఎవరైనా.. ఏ వయసు వారైనా వేయవచ్చు. అయితే యోగాలో కొన్ని ఆసనాలు కష్టతరంగా మరికొన్ని సులభతరంగా ఉంటాయి. సులభతరమైన ఆసనాలలో అర్ధ హలాసనం కూడా ఒకటి. ఈ ఆసనం వేయు విధానం చాలా ఈజీ.. అలాగే ఈ ఆసనం ద్వారా ఉపయోగాలు కూడా అధికం.

అర్ధ హలాసనం వేయు విధానం

ముందుగా నేలపై లేదా యోగా షీట్ పై వెలకిల్ల పడుకొని కాళ్ళను నిటారుగా 90 డిగ్రీస్ కోణంలో పైకి లేపాలి. ఇలా రెండు కాళ్ళను నిటారుగా గాల్లో ఉంచినప్పుడు చేతులను నెలకు సమాంతరంగా ఉంచాలి. అయితే ఈ ఆసనం మొదటిసారి వేసినప్పుడు కాస్త కష్టతరంగా అనిపించినప్పటికి..అలవాటు ప్రకారం ఈ ఆసనం సులభంగానే అనిపిస్తుంది. మొదటిసారి కాళ్ళను 90 కోణంలో నిలబెట్టేటప్పుడు గోడ సహాయం కూడా తీసుకోవచ్చు.

అర్ధ హలాసనం వల్ల లాభాలు

ప్రతిరోజూ ఈ అర్ధ హలాసనం వేయడం వల్ల మెదడుకు ఆక్సిజన్ సరఫరా మెరుగుపడుతుంది. తద్వారా ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పరుగుతుంది. ఒత్తిడి, ఆందోళన వంటి మానసిక రుగ్మతలకు కూడా ఈ ఆసనం ద్వారా చక్కటి పరిష్కారం లభిస్తుంది. నిద్రలేమి వంటి సమస్యలను దూరంచేసి హాయిగా నిద్ర పట్టేలాచేస్తుంది. ఈ ఆసనం ప్రతిరోజూ వేయడంవల్ల బీపీ నియంత్రణలో ఉంటుంది. అలాగే గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. ఈ అర్ధ హలాసనం వల్ల ఉదర తొడ కండరాలు దృఢంగా మారతాయి. అజీర్తి, గ్యాస్, మలబద్దకం వంటి సమస్యలు దూరం అవుతాయి.

గమనిక
గర్భిణీలు, ఉదర, కాలేయ సంబంధిత వ్యాధులు ఉన్నవారు ఈ ఆసనం వేయరాదు..

- Advertisement -