నూతన సంవత్సరానికి మరికొద్ది గంటలు మాత్రమే మిగిలిఉంది. ముఖ్యంగా యూత్ నూతన సంవత్సర వేడుకలను ఘనంగా జరుపుకునేందుకు సిద్ధమవుతున్నారు. అయితే నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొనడం వరకు ఓకే కానీ ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ఖచ్చితంగా ఇబ్బందులు తప్పవు.
ప్రధానంగా నూతన సంవత్సరం సందర్భంగా మితిమీరిన వేగంతో డ్రైవ్ చేయకూడదు. బైకులపై తిరుగుతూ హారన్లు మోగిస్తూ, అతి వేగంగా వెళతారు ఈ ఏ మాత్రం పట్టుతప్పిన న్యూ ఇయర్ విషాద ఇయర్‌గా మారే అవకాశం ఉంది.అలాగే కొత్త ఏడాదికి స్వాగతం పలికేందుకు చాలా మంది మద్యం తాగుతూ ఆ సమయం వరకు వేచి చూస్తూ ఉంటారు. మద్యం తాగి బండి నడపడం వల్ల ప్రమాదాలు జరగవచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండటం మంచిది. అలాగే పోలీసుల డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడితే జరిమానాతో పాటు జైలు శిక్ష తప్పదు.
నూతన సంవత్సరం అనగానే గుర్తుకొచ్చేది కేక్. అనారోగ్యం బారిన పడకుండా నాణ్యత ప్రమాణాలు పాటించే కేకులనే కొనుగోలు చేయండి. లేదంటే అనారోగ్యం బారిన పడటం ఖాయం. నూతన సంవత్సరం సందర్భంగా డీజేలకు అనుమతి లేదు. నిర్ణీత సమయంలో మద్యం దుకాణాలు మూసేయాలి. మద్యం తాగి వాహనం నడపవద్దని పోలీసులు తెలుపుతున్నారు. సో మొత్తంగా కొత్త సంవత్సరం విషాదంగా మారకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి.
Also Read:బాన్సువాడలో ఎగిరేది గులాబీ జెండానే