ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్‌ను వరుసగా రెండుసార్లు రన్నరప్‌గా నిలిచింది. దీంతో తీవ్ర నిరాశలో ఉన్న భారత జట్టుకు తాజాగా బీసీసీఐ రానున్న రెండేళ్ల కాలం పాటు టెస్ట్ షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈ జులైలో విండీస్‌తో జరిగే రెండు టెస్టుల సిరీస్‌తో భారత్ డబ్ల్యూటీసీ 2023-2025 మ్యాచ్‌లు మొదలు కానున్నాయి. ఈ సారి టీమిండియా మొత్తంగా 19టెస్టులు ఆడనుంది. స్వదేశంలో ఇంగ్లాండ్‌తో ఐదు బంగ్లాదేశ్‌తో రెండు, న్యూజిలాండ్‌తో మూడు టెస్టులు ఆడనుంది. భారత్ వెలుపల విండీస్‌తో రెండు, దక్షిణాఫ్రికాతో రెండు, ఆస్ట్రేలియాతో ఐదు టెస్టులు ఆడనుంది.
భారత షెడ్యూల్
విండీస్‌లో భారత్ పర్యటన
జులై12-16 డిమినికా మొదటి టెస్టు
జులై20-24ట్రినిడాడ్‌లో రెండో టెస్ట్ మ్యాచ్
సౌతాఫ్రికాలో భారత్ పర్యటన
డిసెంబర్ 2023-జనవరి 2024 …రెండు టెస్టులు
భారత్‌లో ఇంగ్లాండ్ పర్యటన
జనవరి-ఫిబ్రవరి2024 …ఐదు టెస్టులు
భారత్‌లో బంగ్లాదేశ్ పర్యటన
సెప్టెంబర్-అక్టోబరు 2024… రెండు టెస్టులు
భారత్‌లో న్యూజిలాండ్ పర్యటన
అక్టోబరు-నవంబరు 2024…మూడు టెస్టులు
Also Read: TELANGANA:కళాఖండాలకు అంతార్జాతీయ గౌరవం
ఆస్ట్రేలియాలో భారత్ పర్యటన(బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ)
నవంబర్2024- జనవరి2025 …ఐదు టెస్టులు
Also Read: BCCI:మెగా టోర్నీ ముసాయిదా షెడ్యూల్ విడుదల..!