- Advertisement -
కరోనా ఉదృతి నేపథ్యంలో ఐపీఎల్ 14వ సీజన్‌ను నిలిపివేసింది బీసీసీఐ. ఐపీఎల్ జట్లలో పలువురు ఆటగాళ్లు కరోనా బారినపడుతుండడంతో బీసీసీఐ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సీజన్ కు ఐపీఎల్ ను నిలిపివేస్తున్నట్టు బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా వెల్లడించారు. టోర్నీని రీషెడ్యూల్ చేసే అవకాశాన్ని పరిశీలిస్తున్నామని. ఇప్పటికైతే పూర్తిగా రద్దు చేయలేదు అని ఆయన చెప్పారు. కాగా, ఇప్పటివరకు తాజా సీజన్ లో 29 మ్యాచ్ లు జరగ్గా, మిగిలిన మ్యాచ్ లన్నింటినీ ముంబయిలోనే జరపాలని ప్రతిపాదనలు వస్తున్నాయి. దీనిపై మరింత స్పష్టత రావాల్సి ఉంది.
- Advertisement -