ఎన్నారైలంతా కేసీఆర్ వెంటే- అనిల్ కూర్మాచలం

26
anil

మాజీ మంత్రి ఈటెల రాజేందర్ అమెరికాలోని ఎన్నారైలతో సమావేశమైనట్టు వార్తల్లో చూశానని, నిన్నటి దాకా వారి ఓటమిని కోరుకుంటూ వారిని విమర్శించిన కొంత మంది మరియు ఈటెల 20 సంవత్సరాల రాజకీయ ప్రస్థానంలో ఒక్కనాడు కూడా ఒక మాట సాయం చెయ్యని వారు సమావేశం పెట్టడం చాలా విడ్డురంగా ఉందని ఎన్నారైలంతా వీరిని చూసి నవ్వుకుంటున్నారని ఎన్నారై తెరాస వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం తెలిపారు.

ప్రతీ ఒక్కరికి ఎవరు ఎవరితోనైనా సమావేశం పెట్టుకోవచ్చు కానీ ఎన్నారైల పేరుతో సమావేశం పెట్టి రాజకీయ విమర్శలు చెయ్యడం ఎంత వరకు సబబో ఎన్నారై సమాజం ఆలోచించాలి. ఎన్నారైలు ఎప్పుడు కూడా అవినీతి రహిత సమాజాన్ని కోరుకున్నారు, నేడు సీఎం కెసిఆర్ నిర్భయంగా ఎంతటి వారినైనా ఉపేక్షించకుండా తీసుకుంటున్న నిర్ణయాలను ఎన్నారైలంతా హర్షిస్తున్నారని, మేమంతా కెసిఆర్ వెంటే ఉన్నామని చెపుతున్నారని అనిల్ కూర్మాచలం తెలిపారు. 

ఇప్పటివరకు ఎన్నారైలుగా కెసిఆర్ గారి నాయకత్వంలో ఈటెల గారికి అండగా మేమున్నామని నేడు సమావేశాలు పెట్టేది అవకాశావాదులు కనీసం ఇలాగైనా ప్రజల్లో ఉందామని ఆశిస్తున్నవారేనని అనిల్ తెలిపారు. దమ్ముంటే నేటి వరకు ఈటెల కోసం ఎం చేశారో పాల్గొన్న సభ్యులు బయట పెట్టాలని అనిల్ కూర్మాచలం సవాల్ విసిరారు, ఇందులో పాల్గొన్న వారంతా ఎన్నారైల కంటే ఎక్కువ తెరాస వ్యతిరేకులని,ప్రతిపక్ష పార్టీల సభ్యులేనని అనిల్ కూర్మాచలం తెలిపారు. 

రాష్ట్రం లోనే కాదు దేశం బయటకూడా సామాజిక న్యాయం పాటించి ఎన్నో దేశాల్లో బలహీనవర్గాలకు చెందిన కార్యకర్తలకు అధ్యక్ష పదవులు ఇవ్వడమే కాకుండా ఒక బీసీ బిడ్డగా నాకు కెసిఆర్ గారు ఎంతో గౌరవమిచ్చి ఉద్యమ సమయంలో ఎన్నారై తెరాస బాధ్యతలు అప్పగించారని గుర్తు చేశారు. కానీ ఇతర పార్టీ ఎన్నారై శాఖలల్లో సామాజిక న్యాయం లేదని తెలిపారు.