ఆసియాకప్ విజయం తర్వాత మహిళ భారత మహిళ క్రికెటర్లకు బీసీసీఐ శుభవార్త తెలిపింది. ఇక నుంచి బోర్డు సమానత్వంను ప్రదర్శిస్తుందని ప్రకటించింది. దీనికి సంబంధించిన విషయంపై బీసీసీఐ కార్యదర్శి జై షా ట్విటర్ ద్వారా తెలియజేశారు. భారత క్రికెట్ లింగ సమానత్వం కోసం ఒక కొత్త శకంలోకి వెళుతున్నందున పురుషులు మరియు మహిళా క్రికెటర్లకు మ్యాచ్ ఫీజు సమానంగా ఉంటుందని తెలిపారు.
మహిళా క్రికెటర్లకు, పురుషులతో సమానమైన వేతనం ఇవ్వబడుతుందన్నారు. టెస్ట్, వన్డేలు మరియు టీ20లకు వరుసగా 15 లక్షలు, 6 లక్షలు మరియు 3 లక్షలు చెల్లించనున్నట్టు ప్రకటించారు. అయితే ఈ యేడాది జూలైలో న్యూజిలాండ్ ఐదేళ్ల కాల పరిమితి ఒప్పందంతో పురుషులకు, మహిళలకు సమాన వేతనం చెల్లించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ ఒప్పందం అన్ని ఫార్మాట్లలోను దేశీయంగా, అంతర్జాతీయ వేదికలపై ఆడే మ్యాచ్‌లకు సమాన ఫీజును చెల్లిస్తామని ప్రకటించారు.
న్యూజిలాండ్ తరహాలోనే బీసీసీఐ కూడా సమాన వేతనాలు చెల్లించడానికి నిర్ణయం తీసుకోవడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆసియా కప్‌ను ఇప్పటి వరకూ పురుషులు 7సార్లు టైటిల్‌ను సాధించారు. కాగా భారత మహిళలు కూడా ఇప్పటివరకు 7సార్లు టైటిల్ పొందడం విశేషం.
ఇవి కూడా చదవండి..
సినీరంగంలోకి ధోని..
భారత్ చేతిలో పాక్ ఘోరపరాజయం
రూసో సూపర్ షో..బంగ్లా ఓటమి