అంతర్జాతీయ స్టార్ ప్రియాంక చోప్రా నటించిన ‘బేవాచ్’ చిత్రం 2017లో వచ్చిన అత్యంత చెత్త సినిమాల్లో ఒకటిగా నిలిచింది. హాలీవుడ్లో ఉత్తమ చిత్రాలను ప్రోత్సహిస్తూ ఆస్కార్లు అందజేస్తే… చెత్త చిత్రాలను గుర్తుచేస్తూ గోల్డెన్ రేస్బెర్రీ అవార్డులు ఇస్తారు. 2018కి గాను వివిధ కేటగిరీల్లో చెత్త సినిమాలు, నటులు, సాంకేతిక నిపుణుల జాబితాను గోల్డెన్ రేస్బెర్రీ ప్రకటించింది.
చెత్త అవార్డుల ఎంపిక పూర్తిగా ఆన్లైన్ ఓటింగ్ ద్వారానే జరుగుతుంది. అయితే దేశీ గార్ల్ ప్రియాంక చోప్రా నటించిన తొలి హాలీవుడ్ చిత్రం బేవాచ్ ఏకంగా నాలు విభాగాలలో నామినేట్ అయి అందరిని ఆశ్చర్యపరిచింది. చెత్త చిత్రం, చెత్త హీరో, చెత్త రీమేక్, చెత్త స్క్రీన్ ప్లే విభాగాల్లో ఈ చిత్రం నామినేట్ అయింది. ఆస్కార్ అవార్డుల వేడుకకు ఒకరోజు ముందు అంటే మార్చి 3న ఈ రేస్బెర్రీ అవార్డుల వేడుక జరగనుంది.
అప్పట్లో మహేష్ నటించిన ఒక్కడు హిందీలో తేవార్గా రీమేక్ కాగా, ఈ మూవీ చెత్త అవార్డులకి ఎంపిక అయింది. అలాగే రామ్ చరణ్ నటించిన బాలీవుడ్ చిత్రంకి కూడా ఓ సారి చెత్త అవార్డుల జాబితాలో ఎంపికైంది. అయితే ప్రియాంక నటించిన తొలి హాలీవుడ్ సినిమాని ఇలా చెత్త అవార్డుల జాబితాలో ఎంపిక చేయడం పట్ల అభిమానులు కాస్త నిరూత్సాహానికి గురవుతన్నారు. ప్రస్తుతం ప్రియాంక హాలీవుడ్ టీవీ షో ‘క్వాంటికో’ మూడో సీజన్లోను, ‘ఈజింట్ ఇట్ రొమాంటిక్’ అనే చిత్రంలోను నటిస్తోంది. అలాగే ఆమె నటించిన ‘ఏ కిడ్ లైక్ జేక్’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది.