- Advertisement -
భద్రాద్రి శ్రీ సీతారామచంద్రమూర్తిని దర్శించుకున్నారు సీఎల్పీ నేతలు. ఇవాళ ఉదయం ఆలయానికి చేరుకున్న సీఎల్పీ నేతలు భట్టి విక్రమార్క ,శ్రీధర్ బాబు, జీవన్ రెడ్డి , బలరాం నాయక్ ,ములుగు ఎమ్మెల్యే సీతక్క, భద్రాచలం ఎమ్మెల్యే వీరయ్య లకు ఆలయ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు.
ప్రధాన ఆలయంలోని సీతారాముల ఎదుట ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉపాలయంలో వేంచేసి ఉన్న లక్ష్మీ తయారు అమ్మవారి ఆలయం వద్ద సీఎల్పీ నేతలను శాలువాతో సత్కరించి, వేద ఆశీర్వచనం అందించారు.
- Advertisement -