బొమ్మై టీమ్‌లో ఐదుగురు డిప్యూటీ సీఎంలు!

137
bommai
- Advertisement -

కర్ణాటకలో 2023 అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్‌గా పావులు కదుపుతోంది బీజేపీ అధిష్టానం. ఇందులో భాగంగా యెడీయూరప్ప స్థానంలో బసవరాజు బొమ్మైను సీఎంగా ఎంపికచేయగా ఆయన ప్రమాణస్వీకారం కూడా చేశారు. ఇక సీఎంగా ప్రమాణస్వీకారం చేయడంతో కేబినెట్ కూర్పుపై దృష్టిసారించారు. రానున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కేబినెట్ కూర్పు ఉండేలా జాగ్రత్త తీసుకుంటున్నారు.

ఐదుగురు ఉప ముఖ్యమంత్రులను ఎన్నుకునే అవకాశం ఉందని… ఆరు నుంచి ఎనిమిది మంది కొత్తవారికి.. అందులో యువకులకు అవకాశం ఇవ్వనున్నట్లు రాజకీయ వర్గాల సమాచారం. బొమ్మై క్యాబినెట్‌లో గరిష్టంగా 34 మంది సభ్యులు ఉండవచ్చని భావిస్తున్నారు.

ఎస్సీలు, ఎస్టీలు, వోక్కలిగాస్, లింగాయతులు, ఓబీసీ అనే ఐదు ప్రధాన సామాజిక వర్గాల నుంచి డిప్యూటీ సీఎంలను ఎంపిక చేయనున్నట్లు సమాచారం. 2008 నుంచి అసెంబ్లీ ఎన్నికలలో 113 సీట్ల మ్యాజిక్ ఫిగర్‌ను దాటడానికి బీజేపీ కష్టపడుతోంది. ఈ క్రమంలో అన్ని వర్గాల వారికి చేరువయ్యేందుకు బీజేపీ అధిష్టానం ఐదుగురు డిప్యూటీ సీఎంల నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

- Advertisement -