అదంతా తూచ్‌…బ్యాంకులకు సెలవుల్లేవ్‌..

209
- Advertisement -

సెప్టెంబరు మొదటివారంలో బ్యాంకులు రెండు రోజులు మాత్రమే పనిచేస్తాయి…అంటూ సోషల్‌ మీడియాలో వార్తలు చెక్కర్లుకొడుతున్నాయి. అయితే అదంతా తూచ్‌ అని తేలిపోయింది.

వచ్చేవారంలో బ్యాంకులకు వరుస సలవులున్నాయంటూ వస్తున్న వార్తలపై తాజాగా కేంద్ర ఆర్థికశాఖ స్పందించింది. సెప్టెంబరు మొదటివారంలో బ్యాంకులు సాధారణ సెలవులు మినహా మిగతా రోజుల్లో యథావిధిగా పనిచేస్తాయని స్పష్టతనిచ్చింది.

 Bank Holidayసెప్టెంబరు మొదటివారంలో బ్యాంకులకు 6 రోజుల పాటు సెలవులున్నాయి అంటూ సోషల్‌మీడియాలో వార్తలు వస్తున్నాయని, దీంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారని, అయితే ఇందులో ఆందోళన పడాల్సిన అవసరం లేదని ఆర్థికశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ‘సెప్టెంబరు 1 శనివారం సెలవు లేదు. 2న ఆదివారం సాధారణ సెలవు. ఇక సెప్టెంబరు 3న కృష్ణాష్టమి పండగ ఉన్నప్పటికీ దేశవ్యాప్తంగా సెలవు లేదు. ఈ సెలవును రాష్ట్రాలవారీగానే ఇస్తున్నారు. ఇక సెప్టెంబరు 4,5,6,7 తేదీల్లో బ్యాంకుల కార్యకలాపాలు కొనసాగుతాయి. మళ్లీ సెప్టెంబరు 8 రెండో శనివారం కావడంతో ఆ రోజు సెలవు ఉంటుంది’ అని ఆర్థికశాఖ స్పష్టంచేసింది. కాగా.. సెలవు రోజుల్లోనూ అన్ని రాష్ట్రాల్లోని ఏటీఎంలు పనిచేస్తాయనికూడా తెలిపింది.ఆన్‌లైన్ బ్యాంకింగ్‌ లావాదేవీలు కొనసాగుతాయని ఆర్థికశాఖ తెలిపింది.

ఇదిలా ఉంటే..సెప్టెంబరు 4, 5 తేదీల్లో ఆర్‌బీఐ ఉద్యోగులు సామూహిక సెలవు ప్రకటించారు. ఈ సెలవుకు, మిగతా బ్యాంకు ఉద్యోగులకు ఎలాంటి సంబంధం లేదని ఆర్థికశాఖ క్లారిటీ ఇచ్చింది.

- Advertisement -