” శైలజారెడ్డి అల్లుడు ” పుచ్చకాయంత ప్రేమతో వస్తున్నాడు..!

206

మారుతీ దర్శకత్వం లో నాగచైతన్య, అను ఇమ్మాన్యుయేల్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం శైలజ రెడ్డి గారి అల్లుడు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో వస్తున్న ఈ చిత్రం ట్రైలర్ ప్రస్తుతం సోషల్ మీడియాను కుదిపేసేపనిలో ఉంది.

Shailaja Reddy Alludu Official Trailer released today..

“నాపేరు చైతన్య ..” అంటూ నాగ చైతన్య మాటలతో స్టార్ట్ ఐన ఈ ట్రైలర్ మొదటి నుంచి చివరి వరకు ఎంతో కామెడీగా కొనసాగింది. ట్రైలర్ ని బట్టి చూస్తే రమ్యకృష్ణ పాత్ర ఈ సినిమాలో హైలెట్ గా నిలవబోతుందని తెలుస్తుంది. ఈ చిత్రం లో ఆను ఇమ్మాన్యుయేల్ గ్లామర్ తో పాటు నటనకు కూడా ప్రాధాన్యతను ఇచ్చినట్టుంది. ఇక పృథ్వి, వెన్నెల కిషోర్ నవ్వులని పండించడంలో విజయం సాధించారని తెలుస్తుంది.

Shailaja Reddy Alludu Official Trailer released today..

“మీలో పుచ్చకాయంత ప్రేముందా” అని వెన్నెల కిషోర్ చెప్పిన డైలాగ్ ట్రైలర్ కే హైలెట్ అయ్యింది. మొత్తం మీద శైలజారెడ్డి గారి అల్లుడు కథకు ప్రాధాన్యతను ఇస్తూనే అందరినీ కడుపుబ్బా నవ్వించడానికి వస్తున్నట్టు అర్ధమవుతుంది. సెప్టెంబర్ 13 న రిలీజ్ కాబోతున్న ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకోగలదో చుడాలిమరి.

Shailaja Reddy Alludu Official Trailer | Naga Chaitanya | Anu Emmanuel | Ramya Krishnan | Maruthi