నల్ల బాబుల కొత్త దందాలు…

365
getting rid of old currency
getting rid of old currency
- Advertisement -

నల్లధనాన్ని తెల్ల ధనంగా మార్చుకునేందుకు అక్రమార్కులు కొత్త దార్లను అన్వేషిస్తున్నారు. నోట్లను మార్చుకునేందుకు అందివచ్చే ఏ అవకాశాన్నీ వదలకుండా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకోసం నల్లకుబేరులు విమానాశ్రయాల్లోని ఎయిర్ లైన్స్ కౌంటర్లను టార్గెట్ చేశారు. ఈ కౌంటర్లను వాడుకొంటూ, అక్రమార్కులు నల్లధనాన్ని చలామణిలోకి తెచ్చే ప్రయత్నాలు చేశారు. ఇంటిల్లిపాదికీ కలిసి విదేశాలకు లక్షలు పోసి టికెట్లు కొనుగోలు చేసి, ఆపై వాటికి క్యాన్సిలేషన్ రిక్వెస్ట్ పెట్టడం ద్వారా ఆ డబ్బును తమ ఖాతాల్లోకి వేసుకోవాలని చూశారు.

ఈ ఘరానా మోసాన్ని ఆదిలోనే పసిగట్టిన కేంద్రం, పాత నోట్లతో టికెట్లను బుక్ చేసుకున్న వారి టికెట్లను క్యాన్సిల్ చేయొద్దని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు కౌంటర్ల దగ్గర పాత రూ. 500, రూ. 1000తో టికెట్లను కొనుగోలు చేసిన వారికి క్యాన్సిల్ సదుపాయం ఉండదని, వారికి ఎటువంటి రుసుమును తిరిగి ఇవ్వబోమని ఎయిర్ లైన్స్ సంస్థలు ప్రకటించాయి. సాధారణంగా ఎయిర్ లైన్స్ కౌంటర్ల వద్ద నిత్యమూ రూ. 20 నుంచి రూ. 25 లక్షల వరకూ మాత్రమే స్పాట్ బుకింగ్ ద్వారా వచ్చేవి. కానీ, నోట్ల రద్దు ప్రకటన తరువాత రోజుకు రూ. 1 కోటికి పైగా టికెట్లు బుక్ అయ్యాయి.

పెద్ద నోట్ల రద్దుతో మరో దందాకు తెరలేపారు నల్ల బాబులు. పేదవారినే లక్ష్యంగా చేసుకుంటున్న నల్లబాబులు భారీగా పేదవారి అకౌంట్లను కొనుకుంటున్నారు. ఒక్క అకౌంట్‌లో రూ.2.5 లక్షల వరకు జమ చేసుకోవచ్చని.. అంతకు మించి డిపాజిట్ చేస్తే ఐటీ దెబ్బ తప్పదని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ హెచ్చరించిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో బంగ్లాదేశ్‌, పశ్చిమబెంగాల్ సరిహద్దులే కేంద్రంగా నల్లబాబులు రెచ్చిపోతున్నారు. కూలీలు, పేదవాళ్ల బ్యాంకు అకౌంట్లను కేవలం రూ.2000 లేదా రూ.3000లకు కొనుగోలు చేస్తూ.. అకౌంట్ కు సంబంధించిన వివరాలు ఎవరికీ చెప్పవద్దని ఒప్పందాలు చేసుకుంటున్నారు. దేశంలోకి నకిలీ కరెన్సీ అధికంగా సరఫరా అవుతున్న బంగ్లాదేశ్, పశ్చిమబెంగాల్ సరిహద్దు ప్రాంతాల్లో ఈ దందా నడస్తోంది. కొందరైతే కేవలం రూ.1000 మాత్రమే అమ్ముకుంటున్నారట. నల్ల బాబులు సాగిస్తున్న ఈ కొత్త దందా దేశానికే దిమ్మతిరిగే షాక్ ఇస్తోంది.

- Advertisement -