- Advertisement -
అరుణాచల్‌ప్రదేశ్ సీఎం పెమాఖండూతో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ భేటీ అయ్యారు. ఈశాన్య రాష్ట్రాల పర్యటనలో భాగంగా గురువారం అరుణాచల్‌ప్రదేశ్ రాజధాని ఇటానగర్ చేరుకున్నారు బండి సంజయ్.
ఈ సందర్భంగా ఆ రాష్ట్ర సీఎం పెమాఖండూతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఖండూకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు బండి. అక్కడి నుంచి నేరుగా పపుంపుర జిల్లాలోని యుపియా గ్రామం వద్దనున్న ఐటీబీపీ 31వ బెటాలియన్ హెడ్‌క్వార్టర్స్ సందర్శించారు.
అమరవీరుల ఘాట్ వద్ద పూలమాల వేసి వీరమరణం పొందిన ఐటీబీపీ జవాన్లకు నివాళి అర్పించారు. ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ) జవాన్ల ధైర్య సాహసాలు మరువలేమని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు బండి సంజయ్.
Also Read:వినాయక చవితి..విత్తన గణపతి
- Advertisement -

