గాలిలోనే పేలిపోయింది ఓ ఫైటర్ జెట్ విమానం. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. రాయల్ మలేషియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన F/A-18D Hornet ఫైటర్ జెట్‌కి ప్రమాదం జరిగింది.
టేకాఫ్ అవుతున్న క్రమంలో మంటలు చెలరేగి గాలిలోనే పేలిపోయింది జెట్. వెంటనే అప్రమత్తమై పారాచూట్ సాయంతో కిందికి దూకి ప్రాణాలు దక్కించుకున్నారు పైలట్.
రాయల్ మలేసియన్ ఎయిర్ ఫోర్స్ (RMAF) యుద్ధ విమానం ఎయిర్‌బేస్ నుండి టేకాఫ్ అవుతున్న సమయంలో మంటల్లో కాలి బూడిదైంది. గురువారం రాత్రి 9.05 గంటలకు, కువాంటాన్ ఎయిర్‌బేస్ నుండి ఒక RMAF F/A-18D హార్నెట్ టేకాఫ్ అయింది. విమానం ఎగురుతున్న వెంటనే స్పార్క్స్ ఎగిసిపడినట్టు, ఆపై భారీ పేలుడు సంభవించి విమానం మంటల్లో కూరుకుపోయినట్టు వీడియోల్లో కనిపించింది. RMAF చీఫ్ జనరల్ దాతుక్ సెరీ మహ్మద్ నొరజ్లాన్ అరిస్ ఈ ఘటనను ధృవీకరించారు.
Also Read:వినాయక చవితి..విత్తన గణపతి

