Bandi:బండి ‘మతరాజకీయం’ మానవా!

12
- Advertisement -

మత వ్యవహారాన్ని తరచూ ప్రస్తావిస్తూ వివాదాల్లో చిక్కుకునే బండి సంజయ్ మరోసారి అదే ఉచ్చులో ఇరుకున్నారు. ఇటీవల చేపట్టిన ప్రజాహిత యాత్రలో ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారుతున్నాయి. రాముడు అయోద్యలో పుట్టినట్లు గ్యారెంటీ ఏంటి అని కాంగ్రెస్ నేతలు అంటున్నారని, మీరు తల్లి గర్భం నుంచి పుట్టడనడానికి గ్యారెంటీ ఏంటి అని ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమరాన్ని రేపుతున్నాయి. బండి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. బండి సంజయ్ మాట్లాడిన మాటలు మహిళలను కించపరిచేలా ఉన్నాయని విమర్శలు గుప్పిస్తున్నారు. బండి సంజయ్ మతతత్వ రాజకీయాలు మానుకోవాలని హితవు పలుకుతున్నారు. అంతే కాకుండా ఆయన చేసిన వ్యాఖ్యలపై హుస్నాబాద్ పోలీస్ స్టేషన్ లో కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు కూడా.

ఇకపోతే మొదటి నుంచి కూడా బండి సంజయ్ ఆయన ప్రసంగాల్లో ఏదో మూలాన మత ప్రస్తావన తీసుకోస్తూనే ఉంటారు. గతంలో మసీదుల విషయంలోనూ, ముస్లిం సామాజిక వర్గంపైనా.. ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమరాన్ని రేపిన సంగతి తెలిసిందే. ప్రజాప్రతినిధిగా అన్నీ మతాల పట్ల సమానత్వం కలిగి ఉండాల్సిన బండి సంజయ్ మత విద్వేషాలు రెచ్చగొడుతూ.. ఆయా మతాలను కించపరుస్తారనే విమర్శ ఎప్పటి నుంచో వినిపిస్తోంది.

ఈ వ్యవహార శైలి కారణంగానే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చవి చూశారనే టాక్ కూడా గట్టిగానే నడుస్తోంది. అయినప్పటికీ మళ్ళీ ఆయన ప్రసంగాల్లో మత ప్రస్తావన తీసుకోస్తూ రాజకీయ వివాదానికి తెర తీస్తున్నారనేది కొందరి అభిప్రాయం. ఇకపోతే రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన మరోసారి కరీంనగర్ బరిలో నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో కరీంనగర్ నుంచి గెలుపొందినప్పటికి అక్కడ ఎలాంటి అభివృద్ది చేపట్టలేదనే విమర్శ ప్రధానంగా వినిపిస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో ఈసారి ఆయనకు గెలుపు కష్టమే అనే గుసగుసలు రాజకీయ వర్గాల్లో జరుగుతున్నాయి. మరి బండి సంజయ్ విషయంలో ప్రజల తీర్పు ఎలా ఉంటుందో చూడాలి.

Also Read:బండి సంజయ్‌ది రాజకీయ డ్రామా:పొన్నం

- Advertisement -