ఏపీలో కాంగ్రెస్ ‘సంచలన హామీలు’ ?

9
- Advertisement -

గత కొన్నాళ్లుగా దక్షిణాది రాష్ట్రాలపై దృష్టి సారించిన కాంగ్రెస్ ఒక్కో రాష్ట్రంలో సత్తా చాటుతు వస్తోంది. గత ఏడాది జరిగిన ఆయా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మొదట కర్నాటకలో అధికారం సాధించిన హస్తం పార్టీ ఆ తర్వాత తెలంగాణలో కూడా అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు ఏపీపై దృష్టి కేంద్రీకరించినట్లు తెలుస్తోంది. ఏపీలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలతో పూర్వ వైభవం పొందాలని గట్టి పట్టుదలతో ఉంది. అందుకు తగ్గట్టుగానే వ్యూహరచన చేస్తూ ముందుకు సాగుతోంది కాంగ్రెస్ హైకమాండ్. ఏపీలో 2014 తర్వాత కాంగ్రెస్ పూర్తిగా పతనం అయిన సంగతి తెలిసిందే. అసలు ఏపీలో కాంగ్రెస్ ఉందనే విషయం కూడా చాలమంది మర్చిపోయారు..

అయితే కర్నాటక, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో అధికారం సాధించడంతో అదే జోష్ లో ఏపీని టార్గెట్ చేసింది హస్తం అధిష్టానం. పార్టీలో సీనియర్ నేతలు ఎంతో మంది ఉన్నప్పటికి ఫైర్ బ్రాండ్ గా పేరున్న షర్మిలకు అధ్యక్ష బాధ్యతలు కట్టబెట్టి పార్టీకి కొత్త ఊపిరినిచ్చారు. ఇక ఎన్నికలు సమీపిస్తుండటంతో అందరి దృష్టిని ఆకర్షించేలా మేనిఫెస్టో రూపకల్పనకు కాంగ్రెస్ సిద్దమైనట్లు టాక్. కర్ణాటక, తెలంగాణ రాష్టారాల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం ఆ పార్టీ ప్రకటించిన హామీలే.

ఇప్పుడు ఏపీలో కూడా హామీల విషయంలో గట్టిగానే ప్లాన్ చేస్తున్నారట. ముఖ్యంగా ప్రత్యేక హోదా, 2 లక్షల రుణమాఫీ, కుటుంబానికి ఒక ఉద్యోగం.. ఇలా చాలా హామీలనే కాంగ్రెస్ ప్లాన్ చేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇతర పార్టీలకు భిన్నంగా మేనిఫెస్టో రూపొందించే ప్లాన్ లో ఉన్నారట. ఈ మద్య మేనిఫెస్టో రూపకల్పనలో కాంగ్రెస్ వ్యూహాలు మంచి ఫలితాలనే ఇస్తున్నాయి. దాంతో ఏపీలో కాంగ్రెస్ ప్రకటించే హామీలపై ఎంతో కొంత చర్చ జరుగుతోంది. అయితే కాంగ్రెస్ ఎన్ని ప్రయత్నాలు చేసిన ఈసారి ఎన్నికల్లో సత్తా చాటడం కష్టమేనని, 2029 ఎన్నికల నాటికి ఆ పార్టీ పుంజుకునే అవకాశం ఉందనేది కొందరి అభిప్రాయం. మరి కాంగ్రెస్ ప్రకటించే హామీలు ఆ పార్టీకి ఎంతమేర అనుకూలిస్తాయో చూడాలి.

Also Read:బండి సంజయ్‌ది రాజకీయ డ్రామా:పొన్నం

- Advertisement -