5న గవర్నర్ గా ప్రమాణంచేయనున్న దత్తాత్రేయ

301
dattatreya
- Advertisement -

మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ ఇటివలే హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా నియామకం అయిన సంగతి తెలిసిందే. ఈసందర్భంగా ఈ నెల 5వ తేదీన హిమాచల్ ప్రదేశ్‌గా గవర్నర్‌గా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈవిషయాన్ని దత్తాత్రేయ స్వయంగా తెలిపారు.

వినాయకచవితి పండుగ సందర్భంగా దత్తాత్రేయ ఇవాళ ఖైరతాబాద్ గణేశుడిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా దత్తాత్రేయను ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి ఘనంగా సన్మానించింది. దర్శన అనంతరం దత్తాత్రేయ మాట్లాడుతూ.. ఈ నెల 4న హిమాచల్‌ప్రదేశ్ వెళ్తాను అని తెలిపారు. 5న హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్‌గా ప్రమాణం చేస్తానని పేర్కొన్నారు.

- Advertisement -