ఎంజీఎంకు టీఆర్ఎస్ ఎంపీ విరాళం…

252
banda prakash
- Advertisement -

ఎంజీఎం ఆస్పత్రికి విరాళం అందజేశారు ఎంపీ బండ ప్రకాష్. తన ఎంపీ నిధుల నుండి రూ.14.50 లక్షల నిధులను అందజేసిన బండ ప్రకాష్‌…కరోనా పరికరాలను కొనుగోలు చేయడానికి ఈ నిధులను వినియోగించాలని కోరారు.

ఆసుపత్రిని సందర్శించే రోగులు సమస్యలను ఎదుర్కొంటున్నందున తాను ఈ నిధులు కేటాయిస్తున్నానని బండా ప్రకాష్ తెలిపారు. ప్రజలకు సహాయం చేసేందుకు తాను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాన‌ని చెప్పారు.

తాను ఇచ్చిన నిధులను ఉపయోగించి 20 బీపాప్ (బై లెవ‌ల్‌ పాజిటివ్ ఎయిర్‌వే ప్రెజర్) యంత్రాలు, ఒక మొబైల్ ఎక్స్‌రే యంత్రం, 10 ఎలక్ట్రిక్ సక్షన్ యంత్రాలను కొనుగోలు చేయాల్సిందిగా సూచించారు. మాస్క్ ధరించడం, శానిటైజర్ ఉపయోగించడం, భౌతిక దూరం పాటించ‌డం వంటి అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని పౌరులను ఈ స‌ద‌ర్భంగా తాను కోరుతున్న‌ట్లు ఎంపీ పేర్కొన్నారు.

- Advertisement -