కేటీఆర్‌ను కలిసిన బాల్క సుమన్

1
- Advertisement -

సింగరేణి పరిధిలో కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతి అక్రమాలను నిరసిస్తూ…ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతున్న బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ నిన్న జైలు నుండి బెయిల్ పై విడుదలయ్యారు.

రేవంత్ రెడ్డి ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించి తనను 27 రోజుల పాటు జైలులో నిర్బంధించిందని పేర్కొన్న ఆయన…విడుదలైన అనంతరం ఈరోజు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్) ని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.

ప్రభుత్వ వైఫల్యాలపై గళమెత్తినందుకే కక్షపూరితంగా తనపై కేసులు పెట్టారని బాల్క సుమన్ ఈ సందర్భంగా ఆరోపించారు. కాగా, జైలు నుండి విడుదలైన సుమన్‌కు కేటీఆర్ గారు సాదర స్వాగతం పలికారు. ప్రజాక్షేత్రంలో బీఆర్ఎస్ శ్రేణుల పోరాటాలను అక్రమ కేసులతో ఆపలేరని, పార్టీ ఎల్లప్పుడూ నాయకులకు, కార్యకర్తలకు అండగా ఉంటుందని కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ భేటీలో పలువురు బీఆర్ఎస్ ముఖ్య నాయకులు కూడా పాల్గొన్నారు.

Also Read:సీషెల్స్‌లో ప్రధాని మోదీ పర్యటన

- Advertisement -