ఉదయాన్నే ఈ మూడు యోగాసనాలు వేస్తే ఎన్ని లాభాలో తెలుసా!

28
- Advertisement -

నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఆరోగ్యాన్ని సంరక్షుంచుకోవడం పెద్ద టాస్క్ లా మారింది. తగినంత శారీరక శ్రమ లేకపోవడం వల్ల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఎన్నో అనారోగ్య సమస్యలకు ప్రధాన కారణం శారీరక శ్రమ లేకపోవడమే అని నిపుణులు తరచూ చెబుతూ ఉంటారు. అయితే చాలమంది వ్యాయామం చేయడానికి తగినంత సమయం వెచ్చించలేరు. అలాంటి వారికి యోగా మంచి ప్రత్యామ్నాయం అవుతుంది. ప్రతిరోజూ యోగా చేయడం ఒక అలవాటుగా చేసుకుంటే ఎన్నో రోగాలకు చెక్ పెట్టవచ్చని ఫిట్నెస్ నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ప్రతిరోజూ ఉదయం ఓ మూడు యోగాసనాలు క్రమం తప్పకుండా వేస్తే ఎంతో మేలట. మరి ఆ యోగాసనాలు ఏంటో తెలుసుకుందాం !

1.కాపాల్భాతి
పద్మాసనంలో కూర్చొని వీపును నిటారుగా ఉంచాలి. అరచేతులను మోకళ్లపై ఉంచి లోతుగా ఊపిరి పిల్చుకొని మీ నాభి భాగాన్ని వెన్నెముక వైపు లాగాలి. ఇలా కనీసం 20 సార్లు వేగంగా శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా వదలాలి. ఇలా చేయడం వల్ల కడుపులోని కండరాలన్నీ సంకోచనికి లోనవుతాయి. తద్వారా మలబద్దకం వంటి సమస్య దురమౌతుంది.ఇది శరీరాన్ని ఉత్తేజ పరిచే యోగాసాధనం. ప్రతిరోజూ దీనిని సాధన చేయడం వల్ల ఉధార సంబంధిత సమస్యలన్నీ దురమౌతాయి..

Also Read:ఉమ్మడి వ్యూహం..ఉమ్మడి మేనిఫెస్టో?

2.బాలాసనం
దీనిని చిన్న పిల్లల భంగిమ అని కూడా అంటారు. దీని ద్వారా వెన్నెముక ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. అంతే కాకుండా మెడ, భుజం, వీపు భాగం, తుంటి భాగాలలో ఉండే నొప్పి, ఇతరత్రా సమస్యలను దూరం చేస్తుంది.
వేయు విధానం : వజ్రాసనంలో కూర్చొని పిరుదులను కాలి మడమల మద్య ఉంచి, ఛాతీభాగాన్ని తొడల మీద ఉంచాలి. ఆ తరువాత చేతులను ముందుకు చాపి, నుదుటి భాగాన్నినేలకు తాకేలా ముందుకు వంగాలి. ఈ పొజిషన్ లోనే ఉంటూ లోతుగా శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా వదలాలి.

3) అర్దమత్స్యేంద్రసనం
ఈ ఆసనం వేయడం వల్ల వెన్నెముక శక్తినొందుతుంది. ఇంకా జీర్ణవ్యవస్థ మరుగు పడుతుంది.
వేయు విధానం ; నేలపై కాళ్ళు ముందుకు చాపి వెన్నెముకను నిటారుగా ఉంచి కూర్చోవాలి. ఆ తరువాత ఎడమ కాలును క్రాస్ లెగ్ పొజిషన్ లో మడవాలి. కుడి మోకాలును వంచి కుడిపాదాన్ని ఎడమకాలిపైకి తీసుకురావాలి. ఆ తరువాత వెన్నెముకను తిప్పుతూ కుడి మోకాలు దగ్గర ఎడమచేతిని ఉంచాలి. ఈ పొజిషన్ లో ఉంటూ శ్వాస నెమ్మది గా తీసుకోవాలి

ఈ మూడు ఆసనాలు ప్రతిరోజూ వేయడం వల్ల రోజంగా ఉత్సాహంగా ఉండవచ్చని యోగా నిపుణులు చెబుతున్నారు.

Also Read:విజయ్ ఆంటోనీ …హిట్లర్ ఫస్ట్ లుక్

- Advertisement -