బాలయ్యకు 43 ఏళ్లు !

347
Balakrishna 43 years
Balakrishna 43 years
- Advertisement -

విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు వారసుడిగా నటసింహం బాలకృష్ణ ఇండస్ట్రీకి వచ్చి 42 ఏళ్లు పూర్తయ్యాయి. 1974 ఆగస్ట్ 29న బాలయ్య ముఖానికి రంగేసుకుని వెండి తెరకు పరిచయమయ్యారు. ఎన్టీఆర్ నటించిన తాతమ్మ కల చిత్రంలో బాలయ్య నటించారు. అప్పుడు బాలకృష్ణ వయసు 14 సంవత్సరాలు. అప్పట్నుంచి గ్యాప్ లేకుండా ఏదో ఒక సినిమాలో నటిస్తూనే ఉన్నారు.

balaiah

సినిమా సినిమాకి వైవిధ్యం ప్రదర్శిస్తూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్, గుండెల్లో పెట్టుకునే అభిమానులు, రోమాలు నిక్కబొడుచుకునేలా డైలాగులు, మంచి మనిషిగా ముద్రవేసుకున్నారు. ఇండియాటుడే ఏకంగా బాలయ్య పై ఒక సంచికనే విడుదల చేసింది అర్ధం చేసుకోవచ్చు ఆయనకున్న క్రేజ్ ఏంటో.

తన కెరియర్లో ఎన్నో ఘన విజయాలను సాధించిన బాలయ్య… ఉత్తమ నటుడిగా రెండు నంది అవార్డులను సొంతం చేసుకున్నారు. నాలుగు సంతోషం అవార్డులు, మూడు టీఎస్సార్ అవార్డులు, ఒక సైమా అవార్డు, ఒక సిని’మా’ అవార్డును సాధించారు. తాను నటించిన తొలి చిత్రం ‘తాతమ్మ కల’కు ఉత్తమ బాలనటుడిగా అవార్డును అందుకున్నారు. మూడు సార్లు ఫిలింఫేర్ కు నామినేట్ అయ్యారు.

maxresdefault

1960 జూన్ 10న జన్మించిన బాలయ్య మొదటి సినిమా లోనే నందమూరి తారకరామారావు మరియు భానుమతి రామకృష్ణ లాంటి లెజెండరీ యాక్టర్స్ తో ఎటువంటి బెరుకు లేకుండా నటించాడు. ఆ తరువాత కథానాయకుడిగా తన ప్రస్తానాన్ని మొదలు పెట్టిన బాలయ్య ఎన్నో గొప్ప చిత్రాల్లో నటించాడు . తన తండ్రి తరువాత ఎవరికీ సాద్యం కానటువంటి ఎన్నో సాహసోపేతమైన క్యారెక్టర్స్ లో నటించి మెప్పించాడు.

Balakrishna NTR

పౌరాణిక , జానపద , సాంఘీక , చారిత్రాత్మక , సైన్స్ ఫిక్షన్ ఇలా ఒకటేమిటి అన్ని రకాల సినిమాల్లో నటించి అందరితో ఔరా అనిపించాడు. బాలయ్య బాబు తరం నటులలో అన్ని రకాల పాత్రలు, ప్రయోగాత్మక చిత్రాలు ఎవరు చేయలేదు. ఇంక చేయలేరు కూడా. ఆ ఘనత ఒక్క బాలయ్య బాబు కే సొంతం. మంగమ్మ గారి మనుమడు , ముద్దుల మామయ్య , రౌడీ ఇన్స్పెక్టర్, లారీ డ్రైవర్, పెద్దన్నయ్య, బొబ్బొలిసింహం, సమరసింహా రెడ్డి , నరసింహ నాయుడు, లక్ష్మీ నరసింహ, సింహా, లెజెండ్ ఇదంతా ఒక చరిత్ర, బాక్స్ ఆఫీస్ దుమ్ముదులిపిన చరిత్ర.

Balakrishna's 101 movie with K. S. Ravikumar Chowdary

ఇమేజ్ అనే చట్రంలో లో ఇరుక్కోకుండా వివిధ రకాల చిత్రాల్లో వివిధ రకాల పాత్రల్లో ప్రేక్షకులని అలరించాడు . ఏ స్టార్ హీరో అయినా తన కెరియర్ లో మైలురాయి లాంటి చిత్రాలని పక్కా కమర్షియల్ చిత్రాలని ఎంచుకుంటారు. కాని బాలయ్య బాబు అలా కాదు. ఆయనకి కావలసింది సినిమా హిట్ అవ్వడం కాదు . ప్రేక్షకులకి ఒక కొత్త అనుభూతి ని కల్గించటం. ప్రేక్షకులు కోరుకునే కొత్తదనం ఇవ్వటం. ప్రేక్షకులలో చైత్యన్యం కలిగించడం. తన సినిమా ద్వారా ప్రేక్షకులలో ఎంతోకొంత పరిజ్ఞానాన్ని పంచటం. అవార్డు రివార్డ్ లు నేను ఆశించను …ప్రేక్షకుల మన్నన లే నాకు అన్నీ అని చెప్పే బాలకృష్ణ…అవార్డుల కోసం వెంపర్లాడిన సందర్భం ఏ ఒక్కటీ కనిపించదు.

Balakrishna nag

పరిశ్రమలోని 24 విభాగాలపై పట్టు సాధించారు.  తిరుగులేని కథానాయకుడిగా ఎదిగారు. టాలీవుడ్ టాప్ స్టార్స్ లో ఒకరైనా బాలయ్య… కుర్రహీరోలకు ఏమాత్రం తీసిపోని విధంగా జెట్ స్పీడ్ తో దూసుకు పోతున్నారు. 43 ఏళ్ల సినీప్రస్థానంలో గౌతమీపుత్ర శాతకర్ణి’ లాంటి సూపర్ హిట్ సినిమాతో 100వ చిత్రాన్ని పూర్తి చేసుకున్నా… ఆయనకు నటనపై ఇంకా మమకారం పోలేదు. ‘పైసా వసూల్’ అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ లెజెండ్ మరిన్ని సినిమాలు చేయాలని మనసారా కోరుకుందాం.

 

 

- Advertisement -