తమ్ముడూ…సూర్యుడి వైపు చూడకు

233
- Advertisement -

పవన్ కల్యాణ్ ను విమర్శిస్తూ సినీ విశ్లేషకుడు కత్తి మహేష్ చేసిన వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌ అయిన విషయం తెలిసిందే. ఆ వ్యాఖ్యలే ఇప్పుడు పవన్‌ ఫ్యాన్స్‌కు హీట్‌ పుట్టించాయి. దాంతో కత్తి మహేష్‌ పై మాటల దాడికి దిగారు పవన్‌ ఫ్యాన్స్‌.

 Bandla Ganesh Fires Mahesh Kathi over His

ఇదే క్రమంలో తాజాగా కత్తి మహేష్‌ పై నిర్మాత, నటుడు బండ్ల గణేష్ ఫైర్‌ అయ్యడు. బండ్ల గణేష్ తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెడుతూ, ” తమ్ముడు కత్తి మహేష్, సూర్యుడి వైపు చూడకు… ఆ సూర్య కిరణాలమైన మా లాంటి వారిచే మాడి మసైపోతావు” అని హెచ్చరించాడు.

ఆపై పవన్ అభిమానులు కత్తి మహేష్ ను తిడుతూ పెట్టిన ట్వీట్లను రీట్వీట్ చేశాడు. “నీతి, నిజాయితీ గురించి చెప్పించుకునే అవకాశం పవార్ స్టార్ కు రాదు, లేదు” అని ఓ ట్వీట్ ను, “సూర్యుడి గురించి ఆయన శక్తి గురించి ఆలోచించే అంత బుర్ర లేదులే. అందుకే అర్హతకి మించి మాట్లాడుతున్నాడు” అని మరో ట్వీట్ ను షేర్ చేశాడు.

Bandla Ganesh Fires Mahesh Kathi over His

.

- Advertisement -