తెలుగు చిత్ర పరిశ్రమలో ఇద్దరు బడా హీరోలు ఒకే వేదికపై కనిపిస్తే.. అభిమానుల ఆనందానికి అవుదులే ఉండవు. అందులోనూ మెగాస్టార్ చిరంజీవి, లెజెండరీ బాలకృష్ణ ఇద్దరూ కలిసి కనిపిస్తే ఆ హంగామానే వేరు. బాలయ్య గౌతమీపుత్ర శాతకర్ణి ఫంక్షన్ కి మెగాస్టార్ చిరంజీవి వచ్చి సందడి చేశారు. ఇప్పుడు చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్ దేవ్ విజేత సినిమా ఆడియో ఫంక్షన్ లో చిరుతో పాటు బాలయ్య కూడా సందడి చేయనున్నారని సమాచారం.
చిరంజీవితో ఉన్న సన్నిహిత సంబంధాలు, వారాహి సంస్థతో బాలయ్యకు ఉన్న అనుబంధం నేపథ్యంలో ఈ ఆడియో ఫంక్షన్ కి వచ్చేందుకు బాలయ్య సిద్దంగా ఉన్నారని టాక్ వినిపిస్తోంది. వీళ్లిద్దరు ఒకే వేదికపై కనిపించే అవకాశం ఇటు మెగా అభిమానులకు, అటు నందమూరి అభిమానులకు మరోసారి కలుగుతోంది. కల్యాణ్ దేవ్ హీరోగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని వారాహి చలన చిత్ర సంస్థ నిర్మిస్తోంది. ఈ నెల 24న భారి స్థాయిలో ఆడియో వేడుక జరుపుకోనుంది.
మొదటి సినిమాతోనే అభిమానులను మెప్పించాలని డ్యాన్స్, యాక్టింగ్, ఫైట్స్ లలో కల్యాణ్ దేవ్ ప్రత్యేక శిక్షణ తీసుకున్నాడట. ఇక మొదటి సినిమాతోనే ఇండస్ట్రీలో హిట్ అందించేందుకు చిన్నల్లుడి కోసం చిరు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాడని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆడియో వేడుకకి ఆయనతో పాటు, బాలయ్య బాబుని కూడా ఆహ్వానించారని ఫిలింనగర్లో టాక్ వినిపిస్తోంది.
విజేత టీజర్‌కు అద్భుతమైన స్పందన