ప‌వ‌న్ కొత్త ఇంట్లో అకీరా…స్పందించిన రేణు దేశాయ్..

529
pawan kalyan new house

ప‌వ‌న్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ ఈమ‌ధ్య ట్వీట్ట‌ర్ లో సంచ‌ల‌న కామెంట్స్ పెడుతోన్న విష‌యం తెలిసిందే. ఆమె పెడుతోన్న పోస్ట్ ల‌ను బ‌ట్టి చూస్తే ఎవ‌రితోనో ప్రేమ లో ఉన్న‌ట్లుంది అనుకుంటున్నారు ప‌వ‌న్ క‌ళ్యాణ్ అభిమానులు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన రెండో భార్య రేణూ దేశాయ్‌కి విడాకులు ఇచ్చిన తరువాత కొడుకు అకిరానందన్, కూతురు ఆధ్యలతో కలిసి పూణెలో ఉంటున్న విషయం తెలిసిందే.అటు రాజ‌కీయంగా ఇటు సినిమాల ప‌రంగా ప‌వ‌న్ ఎంత బిజీగా ఉన్నా త‌న కూతురు, కుమారుడితో మాత్రం గ‌డిపేందుకు కొంత స‌మ‌యాన్ని కేటాయిస్తారు.

pawan kalyan new house in vijayawada

ప‌వ‌న్ నిన్న విజ‌య‌వాడ‌లో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని గృహ‌ప్ర‌వేశం చేశాడు. ఈకార్య‌క్ర‌మానికి ప‌వ‌న్ రేణు ల కుమారుడు అకీరా హాజ‌ర‌య్యాడు. భార్య అన్నా లెజీనోవా, కుమారుడు అకీరాతో గృహ ప్ర‌వేశం చేశాడు ప‌వ‌న్. ఈసంద‌ర్భంగా వారిద్ద‌రూ క‌లిసి ఉన్న ఫోటోలు లీక్ కావ‌డంతో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. అకీరా హైట్ ను చూసి న‌వ్వేసింద‌ట అన్నాలెజీనోవా. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇంట్లో అకీరా ను చూసి ప‌లువురు రేణూ దేశాయ్ కి మెసేజ్ లు పంపిస్తోన్నార‌ట‌. ఈవిష‌యంపై ఓ క్లారిటీ ఇచ్చింది రేణు దేశాయ్.

అకీరా హైద‌రాబాద్ కు షిప్ట్ కాలేద‌ని..కేవ‌లం స్కూలు సెల‌వుల‌ను గ‌డ‌ప‌డానికి మాత్ర‌మే త‌న తండ్రి వ‌ద్ద‌కు వెళ్లాడ‌ని చెప్పింది. విజ‌య‌వాడ‌లో ప‌వ‌న్ ప‌క్క‌న అకీరా క‌నిపించ‌డంతో నాకు నిన్న‌టి నుంచి చాలా మెసెజ్ లు వ‌స్తున్నాయ‌ని తెలిపింది. ప్ర‌తి ఒక్క‌రి మెసెజ్ ల‌కు రిప్లే ఇవ్వ‌డం కుద‌ర‌క ఇలా ట్వీట్ట‌ర్ పోస్ట్ చేశాన‌ని తెలిపింది. సెల‌వులు ముగియ‌గానే అకీరా మ‌ళ్లి పుణే వ‌స్తాడ‌ని తెలిపింది. తండ్రి కొడుకులు ఇద్ద‌రూ ఒకే ద‌గ్గ‌ర ఉండ‌టంతో ప‌వ‌న్ అభిమానులు ఆనందం వ్య‌క్తం చేస్తోన్నారు. ఇక ప‌వ‌న్ రాజ‌కీయాల్లో బిజీగా ఉండ‌టంతో త‌న వారసుడిగా అకీరా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చే అవ‌కాశాలు ఉన్నాయ‌ని సినీ వ‌ర్గాల స‌మాచారం.

https://twitter.com/renuudesai/status/1010416927234289670