విజేత టీజర్‌కు అద్భుతమైన స్పందన

230
vijetha teaser
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయమవుతూ తెరకెక్కిన విజేత సినిమా టీజర్ నిన్న విడుదలై ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ పొందింది. యూట్యూబ్ లో నెంబర్ వన్ స్థానంలో ఉండడమే కాకుండా 1 మిలియన్ డిజిటల్ వ్యూస్ వచ్చాయి. టీజర్ లో కళ్యాణ్ దేవ్ తన నటనతో ఆకట్టుకున్నాడు. డైలాగ్ డెలివరీ, స్క్రీన్ ప్రెజెన్స్ చక్కగా కనబరిచాడు.

విజేత టీజర్ చూస్తుంటే, ఈ చిత్రం తండ్రి, కొడుకుల మధ్య ఉండే అనుబంధాలు, ఆప్యాయతలను గుర్తు చేసే విధంగా ఉంది. ఫ్యామిలీ ఆడియన్స్ కు ఈ సబ్జెక్టు కనెక్ట్ అయ్యే విధంగా కనిపిస్తుంది. “మనసుకు నచ్చిన పని చేసుకుంటూ బ్రతకడం అందరికి సాధ్యం కాదు. లైఫ్ లో కొంచెం కాంప్రమైజ్ అయ్యి బ్రతకాలి.” మురళి శర్మ చెప్పిన ఈ డైలాగ్ అందరిని ఆలోచింపచేస్తోంది.

రాకేష్ శశి దర్శకత్వంలో వారాహి చలనచిత్రం పతాకంపై సాయి కొర్రపాటి నిర్మించిన ఈ సినిమాలో కళ్యాణ్ దేవ్ సరసన మాళవిక నాయర్ హీరోయిన్‌గా నటించింది. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా జూన్ 24న భారీ స్థాయిలో “విజేత” ఆడియో ఫంక్షన్ జే. ఆర్.సి కన్వెంక్షన్ లో జరగబోతోంది. సినీ పరిశ్రమ నుండి ప్రముఖులు ఈ వేడుకకు హాజరు కాబోతున్నారు. బాహుబలి కెమెరామెన్ కె.కె.సెంథిల్ సినిమాటోగ్రాఫర్ గా పని చేసిన ఈ సినిమాకు హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించారు. జులై మొదటివారంలో విజేత సినిమాను విడుదల చెయ్యడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

నటీనటులు:కళ్యాణ్ దేవ్, మాళవిక నాయర్, తనికెళ్ళ భరణి, మురళి శర్మ, నాజర్, సత్యం రాజేష్, ప్రగతి, కళ్యాణి నటరాజన్, పృథ్వి, రాజీవ్ కనకాల, జయ ప్రకాష్ (తమిళ్), ఆదర్శ్ బాలకృష్ణ, నోయల్, కిరీటి, భద్రం, సుదర్శన్, మహేష్ విట్టా,సాంకేతిక నిపుణులు:కథ,స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: రాకేష్ శశి,నిర్మాత: రజిని కొర్రపాటి,సాయి కొర్రపాటి ప్రొడక్షన్ ,ప్రెజెంటర్: సాయి శివాని,కెమెరామెన్: కె.కె.సెంథిల్,సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్,సాహిత్యం: రెహమాన్, రామజోగయ్య శాస్త్రి,ఎడిటర్: కార్తీక శ్రీనివాస్,ఆర్ట్ డైరెక్టర్: రామకృష్ణ,స్టంట్స్: జాషువ,పీ. ఆర్.ఓ: వంశీ – శేఖర్.

- Advertisement -