ఒకే సారి రెండు సినిమాలు చేస్తోన్న మెగా డాట‌ర్…

206
niharika

మెగా ఫ్యామిలీ నుంచి ఎంట్రీ ఇచ్చి బుల్లి తెర‌పై త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన గుర్తింపు ఏర్ప‌ర‌చుకుంది మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు కూతురు నిహారిక‌. ప్ర‌స్తుతం ఆమె ప‌లు సినిమాల్లో చేసుకుంటూ వాటితో పాటు వెబ్ సిరీస్ ల‌లో కూడా న‌టిస్తోంది. ఒక మ‌న‌సు సినిమాతో వెండితెర‌పై హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. సినిమా ప్లాప్ అయినా మాత్రం మూవీలో నిహారిక న‌ట‌న‌కు మంచి ప్ర‌శంస‌లు ద‌క్కాయి. త‌రువాతి సినిమా కోసం చాలా రోజులు గ్యాప్ తీసుకుంది. మంచి క‌థ కోసం వెయిట్ చేసింది నిహారిక‌.

Sumanth-Ashwin Niharika

నిహారిక న‌టించిన హ్యాపి వెడ్డింగ్ సినిమా త్వ‌ర‌లోనే విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తోన్నారు. ఈమూవీలో హీరోగా సుమంత్ అశ్వీన్ న‌టించాడు. కొత్త కొత్త క‌థ‌ల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తోంది నిహారిక‌. తాజాగా ఒకేసారి రెండు సినిమాల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేసింది మెగా డాట‌ర్. హ్యాప్పి వెడ్డింగ్ సినిమా కాకుండా మ‌రో రెండు సినిమాల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేసింది.

happy wedding

కొత్త ద‌ర్శ‌కురాలు సుజ‌న ఓ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా..ఈ సినిమాకు సంబంధించి స్క్రీప్ట్ వ‌ర్క్ జ‌రుగుతుండ‌గానే మ‌రో ప్రాజెక్ట్ కు ఓకే చెప్పేసింది. నిర్వాణ సంస్ధ‌వారు త‌మ తొలి సినిమాను నిహారిక తో తీయ‌నున్నారు. ఈ సినిమాతో ప్ర‌ణిత ద‌ర్శ‌కురాలిగా పరిచ‌య‌మ‌వుతోంది. నిహారిక సైన్ చేసిన ఈ రెండు సినిమాల్లో లేడి ద‌ర్శ‌కురాళ్ల‌నే ఎంచుకోవ‌డం విశేషంగా చెప్పుకోవ‌చ్చు. ఇక ఈసినిమాలో హీరోగా రాహుల్ విజ‌య్ ను ఎంపిక చేశారు. ఒకేసారి ఈ రెండు ప్రాజెక్టులు సెట్స్ పైకి వెళ్ల‌నున్నాయి.