వెంటాడి, వేటాడి చంపుతా…బాలయ్య ‘రూలర్’ ట్రైలర్

422
Rular Trailer
- Advertisement -

నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం రూలర్. ప్రముఖ దర్శకుడు కే.ఎస్ రవి కుమార్ ఈచిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే సినిమాకి సంబంధించిన ఫస్ట్‌లుక్స్‌ పోస్టర్స్, టీజర్‌కు సూపర్ రెస్పాన్స్ రాగా.. ఇవాళ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈమూవీలో బాలయ్య రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించనున్నారు.

ఈ సినిమాలో.. సోనాల్ చౌహన్, వేదికలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ట్రైలర్ లో బాలయ్య పవర్ ఫుల్ డైలాగ్స్ తో అకట్టుకున్నాడు. ప్రకాష్ రాజ్, భూమిక, జయసుధ, పలువురు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈసినిమాకు చిరంత‌న్ భ‌ట్ సంగీతం అందిస్తున్నాడు. ప్రముఖ నిర్మాత సీ. కళ్యాణ్‌ నిర్మిస్తున్న ఈసినిమాను డిసెంబర్ 20న విడుదల చేయనున్నారు.

https://youtu.be/T-Hg8HzWM8M

- Advertisement -