- Advertisement -
నటసింహ నందమూరీ బాలకృష్ణ,హిట్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబోలో ఓ చిత్రం రాబోతున్న విషయం తెలిసిందే. ఇది బాలయ్యకు 108వ సినిమా. అయతే ఈరోజు బాలయ్య బర్త్ డే సందర్భంగా తాజాగా ఈ మూవీకి సంబంధించిన అప్ డేట్ వచ్చింది..ఈ విషయాన్ని అనిల్ రావిపూడి స్వయంగా ప్రకటించారు. ఈమేరకు బాలకృష్ణ జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన అనిల్.. తన తదుపరి చిత్రాన్ని ప్రకటించాడు.
‘‘గాడ్ ఆఫ్ మాసెస్, రోరింగ్ లయన్ నందమూరి బాలకృష్ణ గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఆయన 108వ సినిమాను డైరెక్ట్ చేస్తున్నందుకు ఎంతో సంతోషంగా, గౌరవంగా ఉంది. ఈ సారి వచ్చే బ్యాంగ్ మామూలుగా ఉండదు. మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడిస్తాం’’ అని అనిల్ రావిపూడి ట్వీట్ చేశాడు. బాలయ్యతో దిగిన ఫొటోను పోస్ట్ చేశాడు.
- Advertisement -