దేశానికి అతిపెద్ద శక్తి యువతరం- మంత్రి కేటీఆర్

78
- Advertisement -

మంత్రి కేటీఆర్ శుక్రవారం జగిత్యాల జిల్లాలోని పర్యటించారు. ఇందులో భాగంగా ఆయన పలు అభివృద్ది పనులను ప్రారంభించారు. ఈ నేపథ్యంలో కోరుట్లలో నిరుద్యోగ యువత కోసం ఏర్పాటు చేసిన ఉచిత కోచింగ్‌ సెంటర్‌ను మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పాటు జరిగిందే నీళ్లు, నిధులు, నియామకాల కోసమన్నారు. ఉద్యమ నినాదానికి అనుగుణంగా ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు.

అన్ని రాష్ట్రాల వారికి పనికల్పిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మంత్రి కేటీఆర్‌ అన్నారు. చదువు ఎప్పుడూ వృథా కాదని, కష్టపడి చదివితే ఉద్యోగం సాధించడం సులువేనని చెప్పారు. భారతదేశం అతిపెద్ద శక్తి యువతరం అని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే 1.32 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసిందన్నారు. మళ్లీ 90 వేల ఉద్యోగాల నియామక ప్రక్రియను చేపట్టామని తెలిపారు. 95 శాతం స్థానిక అభ్యర్థులకే ఉద్యోగాలు వచ్చేలా సీఎం కేసీఆర్‌ కృషి చేశారని వెల్లడించారు. ప్రైవేటు రంగంలో తెలంగాణలో 19 వేల పరిశ్రమలు పెట్టుబడులు పెడుతున్నాయని మంత్రి పేర్కొన్నారు.

- Advertisement -