నందమూరి బాలకృష్ణ హీరోగా విశిష్ట అద్వైతుడు రామానుజాచార్యుడి బయోపిక్ తీయబోతున్నారనేది టాలీవుడ్ టాక్. రామానుజాచార్యుడి జీవితం విశిష్టం. ఆయన మార్గం చాలా గొప్పది. దేశమంతా ఎరిగిన గొప్ప గురువు రామానుజాచార్యుడు. కచ్చితంగా చెప్పదగిన కథే… పైగా చెప్పాల్సిన కథే. అందుకే, నట సింహం బాలకృష్ణ ఈ ప్రాజెక్టు పై దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. కానీ, నందమూరి బాలకృష్ణకి ఇప్పుడు వయసు పెరిగింది. అయినా, డౌట్ లేదు. బాలయ్య చాలా గొప్పగా నటిస్తాడు.
కానీ, విశిష్ట అద్వైతుడు రామానుజాచార్యుడి పాత్రలో నటిస్తే కుదరదు. జీవించాలి. బాలయ్య బాబు లాంటి నటుడు జీవించినా కుదరదు. ఆ పాత్రకు తగ్గట్టుగా తన గెటప్ ను అండ్ సెటప్ ను మార్చుకోవాలి. అటు భక్తజనాన్ని మెప్పిస్తూనే, ఇటు సగటు ప్రేక్షకుడికీ సినిమా ఎక్కేలా చేయగలగాలి. అదే సమయంలో మైనస్ బడ్జెట్ గాకుండా కనీసం పెట్టిన డబ్బయినా తిరిగి వచ్చేలా చూసుకోవాలి. సహజంగా ఇలాంటి బయోపిక్ లలో కమర్షియల్ ఎలిమెంట్స్ కి స్కోప్ ఉండదు. కాబట్టి.. సాధారణ ప్రేక్షకులూ.. రెగ్యులర్ సినిమా లవర్స్ కి ఈ టైప్ సినిమాలు తొందరగా ఎక్కవు.
ఎక్కాలి అంటే.. కచ్చితంగా కమర్షియల్ కోణంలోనే రామానుజాచార్యుడి బయోపిక్ సాగాలి. కానీ.. ఇక్కడ ఆ అవకాశం లేదు. రామానుజాచార్యుడి జీవితం పూర్తి భక్తిమయం. కాబట్టి.. రొట్ట కొట్టుడు యాక్షన్ జోలికి పోకుండా ఉండాలి. అలాగే రామానుజాచార్యుడి జీవిత కథను ప్లెయిన్‌గా, ప్యూర్‌గా ప్రబోధాత్మకంగానే చెప్పాలి. మరీ ఆ విధంగా సినిమా తీస్తే.. జనం ఆదరిస్తారా..?, కమర్షియల్ గా వర్కౌట్ అవుతుందా?.. పెద్ద డౌటే.
ఇవి కూడా చదవండి…