పవన్​ కి బాలయ్య ఆత్మీయ ఆహ్వానం

57
- Advertisement -

నందమూరి నటసింహం బాలకృష్ణ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇద్దరు ఒకే స్టేజ్ మీద కనిపించారంటే ఫ్యాన్స్ కి పండగే. అయితే ఈరోజు పవన్ కళ్యాణ్, బాలయ్య బాబు హోస్ట్ చేస్తున్న అన్ స్టాపబుల్ విత్ NBK సీజన్-2 షోకి అటెండ్ అయ్యాడు. పవన్ కళ్యాణ్ ను రిసీవ్ చేసుకోవడానికి బాలయ్య స్వయంగా పవన్ వచ్చిన కారు దగ్గరకు వెళ్ళి, ఆప్యాయంగా పవన్ ను పలకరించి హాగ్ చేసుకోవడం అందర్నీ ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. ఇక పవన్ కళ్యాణ్ వస్తున్నాడని తెలుసుకున్న పవన్ ఫ్యాన్స్ అన్నపూర్ణ స్టూడియో దగ్గర సందడి చేశారు.

ఇకపోతే ఈ ఎపిసోడ్ లో మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కూడా జాయిన్ అవ్వనున్నాడని తెలుస్తోంది. అలాగే త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా హాజరు కానున్నాడు. మొత్తానికి ఈ ఎపిసోడ్ కోసం యావత్తు తెలుగు ప్రేక్షక లోకం ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అనట్టు ఏ రకంగా చూసుకున్నా బాలయ్య – పవన్ ఎపిసోడ్ సరికొత్త రికార్డ్స్ ను సృష్టించడం ఖాయం. అన్నిటికీ మించి ఈ ఎపిసోడ్ పై ఏపీ రాజకీయాలు కూడా ముడిపడి ఉన్నాయి.

నిజానికి బాలయ్య – పవన్ ల మధ్య రాజకీయ వార్ ఉన్నా.. ఇప్పుడు ఇద్దరి టార్గెట్ ఒక్కటే. జగన్ ను సీఎం పదవి నుంచి దించడం. ఈ నేపథ్యంలో పవన్ – బాలయ్య రాజకీయాల గురించి ఏం మాట్లాడుకుంటారనే ఆసక్తి అందరిలోనూ ఉంది. ఈ మధ్యలో పవన్ – బాలయ్య ఒకరి గురించి ఒకరు ఎలాంటి కామెంట్స్ చేస్తారనే విషయాలే ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. ఏది ఏమైనా ఎప్పుడూ గంభీరంగా ఉండే బాలయ్య హోస్ట్ గా చేయడం, పైగా ఆ షోకి పవన్ కళ్యాణ్ రావడం విశేషం.

ఇవి కూడా చదవండి..

- Advertisement -