గోపీచంద్-బాలయ్య మూవీకి టైటిల్‌ ఫిక్స్..!

16
Balakrishna

నట సింహం నందమూరి బాలకృష్ణ- మాస్‌ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబోలో ఓ భారీ చిత్రం తెరకెక్కనున్న విషయం తెలిసిందే. బాలకృష్ణ పుట్టినరోజు సంరద్భంగా బాలయ్య 107 సినిమాకు సంబంధించిన అఫీషియల్ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను గోపీచంద్ మలినేని నిజ జీవిత సంఘటనల ఆధారంగా తనదైన శైలిలో యాక్షన్ ఓరియంటెడ్‌గా ఈ సినిమాను తెరకెక్కించనున్నారు.

అయితే ఈ మూవీకి సంబంధించిన తాజాగా వార్త వినిపిస్తోంది. ఈ సినిమాకు పవర్‌ఫుల్ టైటిల్‌ను ఫిల్మ్ ఛాంబర్‌లో రిజిస్టర్ చేయించారు తెలుస్తోంది. ఈ సినిమాకు ‘రౌడీయిజం’ అనే టైటిల్‌ను మైత్రీ మూవీ మేకర్స్ రిజిస్టర్ చేయించాని టాక్‌. ప్రస్తుతం మైత్రీ మూవీ మేకర్స్ పలువురు హీరలతో వరుసగా సినిమాలు నిర్మిస్తున్నారు. ఈ కోవలో ఈ టైటిల్ బాలయ్య కోసమే రిజిస్టర్ చేయించినట్టు తెలుస్తోంది. అంతేకాదు త్వరలో ఈ టైటిల్‌ను కూడా అఫీషియల్‌గా ప్రకటించనున్నట్టు సమాచారం.