ఫ్లాప్‌ డైరెక్టర్ తో బాలయ్య 101వ సినిమా..!

165
Sathakarni,
- Advertisement -

గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాతో నటసింహాం బాలక్రిష్ణ మంచి విజయాన్ని అందుకున్నాడు. శాతకర్ణి సినిమాకు బాలయ్య కెరీర్‌కు మరింత ఉత్సాహాన్ని ఇచ్చిందని చెప్పొచ్చు. అయితే ఇప్పుడు శాతకర్ణి తర్వాత బాలయ్య నెక్ట్స్ సినిమా ఏంటనే క్యూరియాసిటీ మొదలైంది. శాతకర్ణి సినిమా తర్వాత బాలయ్య లీస్ట్ లో రెండు సినిమాలు ఉన్నాయి. ఒకటి కృష్ణ వంశీతో రైతు సినిమా. రెండోది సీనియర్ డైరెక్టర్ కృష్ణారెడ్డితో మరో సినిమా. అయితే ఇందులో మొదట కృష్ణవంశీతో రైతు సినిమాను పట్టాలెక్కిస్తున్నట్టు స్వయంగా బాలయ్యే అనౌన్స్ చేశాడు. కానీ ఇంతలోనే బాలయ్య నెక్ట్స్ సినిమా డైరెక్టర్ మారినట్టు ప్రచారం జరుగుతోంది. ఎవరి అంచనాలకు అందకుండా బాలయ్య ఓ ఫ్లాప్ డైరెక్టర్‌తో తన నెక్స్ట్ మూవీ చేయబోతున్నాడనే టాక్ ఫిల్మ్ సర్కిల్స్‌లో హల్చల్ చేస్తోంది.

Sathakarni,

సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో ‘లింగా’ లాంటి డిజాస్టర్ మూవీ చేసిన కె.ఎస్.రవికుమార్‌తో బాలయ్య మూవీ చేయడానికి రెడీ అవుతున్నాడట. అయితే దీనికి మరో వెర్షన్ కూడా వినిపిస్తోంది. రవికుమార్ ఇంతకుముందు చిరంజీవికి ఓ స్టోరీ చెప్పాడని.. దాన్ని చిరు హోల్డ్‌లో పెట్టాడని.. ఆ స్టోరీనే ఇప్పుడు బాలయ్యతో చేయడానికి రవికుమార్ ప్రయత్నిస్తున్నాడని.. ఇంతవరకూ బాలయ్య నుండి గ్రీన్ సిగ్నల్ రాలేదని అంటున్నారు. దాంతో బాలయ్య నెక్స్ట్ మూవీ ఎవరితో అనేది ఇంకా సస్పెన్‌గానే వుంది.

- Advertisement -