రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” అన్నివర్గాలకు చేరువయ్యింది. ప్రకృతిని ప్రేమించే ప్రతీ ఒక్కరు మొక్కలు నాటుతూ తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. సమాజానికి మంచి సందేశం ఇస్తున్నారు.
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపిచంద్, చెస్ ఛాంపియన్ ద్రోణవల్లి హారిక ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించిన ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ అరుణ్ విష్ణు ఈ రోజు గచ్చిబౌలిలోని తన వ్యవసాయ క్షేత్రంలో మూడు వేప మొక్కలను నాటరు.
అనంతరం అరుణ్ విష్ణు మాట్లాడుతూ.. ప్రకృతి పట్ల బాధ్యతగా ఉండటం మనందరి కర్తవ్యం. ప్రకృతి బ్యాలెన్స్ డ్ గా ఉన్నన్ని రోజులే మనం ఆనందంగా ఉంటాం. అలాంటి అద్భుతమైన సమాజం కోసం అహర్నిశలు శ్రమిస్తున్న రాజ్యసభ సభ్యులు సంతోష్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు.అంతేకాదు, నావంతుగా నేను భవిష్యత్ ఇండియన్ బ్యాడ్మింటన్ స్టార్స్ సంజనా సంతోష్, కుహూ గార్గ్, రోటపర్ణ పంగకు ఛాలెంజ్ చేస్తున్నాను. వారు మూడు మొక్కలు నాటి ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాట్లు తెలిపారు.