సలాం..కరోనా ఫ్రంట్ వారియర్స్: మాజీ ఎంపీ కవిత

277
kalvakuntla kavitha
- Advertisement -

ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కరోనా మహమ్మారిపై పోరాడుతున్న ఫ్రంట్ లైన్ వారియర్స్ కు మాజీ ఎంపీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ధన్యవాదాలు తెలిపారు.రాష్ట్ర ప్రజలందరికీ 74వ స్వాతంత్య్ర దినోత్స‌వ శుభాకాంక్షలు తెలిపిన మాజీ ఎంపీ కవిత, సోషల్ మీడియా లో వీడియో సందేశాన్ని విడుదల చేశారు.

ప్రతి సంవత్సరం స్వాతంత్ర్య దినోత్సవం దేశ ప్రజలందరికీ పండగలాంటిదన్న మాజీ ఎంపీ కవిత.. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఈసారి ప్రత్యేక పరిస్థితుల్లో స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నామన్నారు. ప్రతి ఏడాది ఆగష్టు 15 న స్వాతంత్ర్య సమరయోధులు, జాతి నిర్మాతలను స్మరించుకునేవాళ్లమని..అయితే ఈసారి మాత్రం కరోనా మహమ్మారి పై పోరాడుతున్న యోధులను సైతం గుర్తుచేసుకుంటున్నామని తెలిపారు.

ఇలాంటి పరిస్థితుల్లో కూడా ప్రజలను ఇంట్లో భద్రంగా దాచి, మౌళిక అంశాలు యధావిధిగా నడవడానికి గుప్పెడు సైనికులు కృషి చేస్తున్నారు. 24 గంటలు కరెంటు ఇవ్వడానికి పనిచేస్తున్న విద్యుత్ రంగంలోని నిరుద్యోగుల నుండి, 24 గంటలు ప్రజల గురించి తపన పడే ముఖ్యమంత్రి గారైనా, దేశ సరిహద్దుల్లో పహారా కాసే సైనికుడైనా, దేశ రక్షణ భారాన్ని భరించే రాష్ట్రపతి గారైనా..ఇలా అందరికీ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ధన్యవాదాలు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు” మాజీ ఎంపీ ‌కవిత.

కరోనా నేపథ్యంలో 1300 కిలోమీటర్ల దూరంలో ఉన్న తండ్రి కోసం సైకిల్ మీద వెళ్లిన ఆడబిడ్డను, కరోనా నుండి కోలుకుని ప్లాస్మా దానం చేస్తున్న మహానుభావులను, అనేక మందికి అన్నదానం చేస్తున్న వారిని మాజీ ఎంపీ కవిత గుర్తుచేసుకున్నారు.కరోనా మహమ్మారి నుండి ‌కుటుంబాన్ని‌ కాపాడుకోవడానికి ప్రాచీన పద్దతులను పాటిస్తున్న మాతృమార్తులను ఈ సందర్భంగా కవిత అభినందించారు. వంటింటి నుండి వాఘా సరిహద్దు దాకా, దేశమంతా కరోనా మహమ్మారిని తరిమికొట్టాలనే సంకల్పం బలపడిందన్నారు మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత.ఈ బలమైన సంకల్పాన్ని నిజం చేసే దిశగా ‌ముందు వరుసలో ఉండి కృషి చేస్తున్న ఉద్యోగులకు, సైనికులకు మాజీ ఎంపీ కవిత ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

- Advertisement -