కీర్తి సురేష్ …‘గుడ్ లక్ సఖి’

95
keerthy suresh
- Advertisement -

జాతీయ ఉత్తమ నటిగా అవార్డు అందుకున్న కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో న‌టిస్తోన్న చిత్రం గుడ్ లక్ సఖి. ఆది పినిశెట్టి, జగపతి బాబు కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు. సహ నిర్మాత శ్రావ్య వర్మ నేతృత్వంలో ఎక్కువ మంది మ‌హిళా స‌భ్యులతో ఈ చిత్రం రూపొందింది.

ఈ చిత్రం నుంచి బ్యాడ్ లక్ సఖి అనే ఫుల్ వీడియో సాంగ్‌ను విడుదల చేశారు. దేవీ శ్రీ ప్రసాద్ మంచి బాణీని సమకూర్చగా.. శ్రీమణి అద్భుతమైన సాహిత్యాన్ని అందించారు. హరిప్రియ, సమీర భరద్వాజ్, ఎంఎల్ఆర్ కార్తికేయన్ ఈ పాటను ఆలపించారు. ఈ పాటలో సఖి వల్ల ఊరికి ఎంత బ్యాడ్ జరిగిందో, ఆమె శకునం ఎలాంటిదో ఎంతో సరదాగా చూపించారు. ఈ స్పోర్ట్స్ రామ్‌ కామ్ సినిమాలో కీర్తి సురేష్ పల్లెటూరి అమ్మాయిగా ఎంతో చక్కగా నటించారు.

నగేష్ కుకునూర్ దర్శకత్వం వహిస్తున్న గుడ్ లక్ సఖి సినిమాని ప్ర‌ముఖ నిర్మాత దిల్‌రాజు సమర్పణలో ‘వర్త్ ఏ షాట్ మోషన్ ఆర్ట్స్’ బ్యానర్ పై సుధీర్ చంద్ర ప‌దిరి నిర్మిస్తున్నారు. చిరంతాన్ దాస్ సినిమాటోగ్రాఫ‌ర్‌. ఇప్పటి వరకు ఈ చిత్రం నుంచి విడుదల చేసిన టీజర్, పోస్టర్లు అన్నీ కూడా విశేషమైన ఆదరణను సొంతం చేసుకున్నాయి. నవంబర్ 26న ఈ చిత్రం విడుదల కానుంది.

తారాగ‌ణం: కీర్తిసురేష్‌, ఆది పినిశెట్టి, జ‌గ‌ప‌తిబాబు తదిత‌రులు

సాంకేతిక వ‌ర్గం:
ద‌ర్శ‌క‌త్వం: నగేష్ కుకునూర్
స‌మ‌ర్ప‌ణ‌: దిల్ రాజు (శ్రీ వేంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌)
బ్యాన‌ర్‌: వర్త్ ఏ షాట్ మోషన్ ఆర్ట్స్
నిర్మాత‌: సుధీర్ చంద్ర ప‌దిరి
కో ప్రొడ్యూస‌ర్‌: శ్రావ్య వర్మ
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
సినిమాటోగ్ర‌ఫి: చిరంతాన్ దాస్
పిఆర్ఓ: వంశీ – శేఖ‌ర్‌

- Advertisement -