అనుభవించు రాజా…లిరికిల్ వీడియో రిలీజ్

139
cinema
- Advertisement -

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో రాజ్ తరుణ్ హీరోగా శ్రీను గవిరెడ్డి దర్శకత్వంలో రూపొందుతోన్న అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ అనుభవించు రాజా. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి., శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి సంయుక్తంగా నిర్మిస్తోంది. నవంబర్ 26న ఈ సినిమా విడుదల కాబోతోన్న మేకర్లు ప్రకటించారు. ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలు ఫుల్ స్వింగ్‌లో ఉన్నాయి.

కింగ్ నాగార్జున అనుభవించు రాజా ఫస్ట్ లుక్‌ను విడుదల చేయగా, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ టీజర్‌ను రిలీజ్ చేశారు. యువ సామ్రాట్ నాగ చైతన్య ఈ చిత్రంలోని టైటిల్ సాంగ్‌ను విడుదల చేశారు. ఇక తాజాగా రెండో పాట ‘నీ వల్లే రా’ లిరికల్ వీడియోను హీరోయిన్ పూజా హెగ్డే విడుదల చేశారు.

కశిష్ ఖాన్ ఈ పాటలో ఎంతో ఉత్సాహంగా కనిపిస్తోంది. ఈ పాటలో రాజ్ తరుణ్ మీదున్న తన ప్రేమను కశిష్ ఖాన్ తెలియజేస్తోంది. ప్రేమలో పడ్డ క్షణాల్లో కలిగే ఫీలింగ్స్‌ను ఈ పాట ద్వారా చెప్పబోతోన్నారు.

గోపీ సుందర్ అందించిన ఈ బాణీకి భాస్కర భట్ల మంచి సాహిత్యాన్ని అందించగా.. రమ్య బెహర అద్భుతంగా పాడారు.సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి నాగేష్ బానెల్ కెమెరామెన్‌గా వ్యవహరిస్తున్నారు. చోటా కే ప్రసాద్ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. నటీనటులు : రాజ్ తరుణ్, కశిష్ ఖాన్, పోసాని కృష్ణమురళీ, ఆడుకాలమ్ నరేన్, అజయ్, సుదర్శన్, టెంపర్ వంశీ, ఆదర్శ్ బాలకృష్ణ, రవి కృష్ణ, భూపాల్ రాజు, అరియానా

సాంకేతిక బృందం

రచయిత, దర్శకత్వం : శ్రీను గవిరెడ్డి
నిర్మాత : సుప్రియ యార్లగడ్డ
బ్యానర్స్ : అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై. లి., శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి
సంగీతం : గోపీ సుందర్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : ఆనంద్ రెడ్డి కర్నాటి
సినిమాటోగ్రఫర్ : నాగేష్ బానెల్
ఎడిటర్ : చోటా కే ప్రసాద్
లిరిక్స్ : భాస్కర భట్ల
ఆర్ట్ డైరెక్టర్ : సుప్రియ బట్టెపాటి, రామ్ కుమర్
కొరియోగ్రఫర్ : విజయ్ బిన్నీ
ఫైట్ మాస్టర్ : రియల్ సతీష్
క్యాస్టూమ్ డిజైనర్ : రజినీ.పి
కో డైరెక్టర్ : సంగమిత్ర గడ్డం
పీఆర్వో : వంశీ-శేఖర్

- Advertisement -