ఈ బుల్లి బాహుబలి ఎవరో తెలుసా..?

339
Baby Baahubali And her Story…Who Is She?
Baby Baahubali And her Story…Who Is She?
- Advertisement -

భారతీయ సినీరంగ చరిత్రలో మరే చిత్రానికీ సాధ్యం కాని మహాద్బుతాన్ని రాజమౌళి తీసిన బాహుహలి2 సృష్టించింది. షా భేదాలతో సంబంధం లేకుండా ఈ చిత్రానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ సినిమా వెయ్యికోట్ల మైలురాయిని సునాయసంగా అధిగమిస్తుందని సినీ మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ సినిమా గురించి తాజాగా మరో వార్త ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

bahubali-baby-4

శివ‌గామి ఒడిలో ఆడుకున్న ప‌సికందుగా, ఆమె ప్రాణ‌త్యాగం చేయ‌డంతో బ‌తికిన బాహుబ‌లిగా క‌నిపించిన‌ ఆ శిశువు ఎవ‌రు? అనే అంశంపై కూడా సినీ అభిమానులు చ‌ర్చించుకుంటున్నారు. బాహుబ‌లి సినిమాలో న‌టించిన ఈ చిన్నారి బాహుబ‌లి ఎవరని ఆలోచిస్తున్నారు. అయితే, ఇందులో ఆ చిన్నారి బాహుబ‌లిగా క‌నిపించింది అక్ష‌ర అనే ఓ పాప‌.

 bahubali-baby-5

అయితే అమరేంద్ర బాహుబలి, మహేంద్ర బాహుబలి ఇద్దరినీ పసికందులుగా చూపించినప్పుడు మొదట గ్రాఫిక్స్ చేద్దాం అనుకున్నారట. కానీ… రాజమౌళి పట్టుబట్టే సరికి ఇక ఆ అవకాశం బేబీ అక్షరకు దక్కింది. బాహుబలి సినిమా షూటింగ్ కేరళలోని అతురపల్లి జలపాతాల వద్ద జరిగింది. ఆ ప్రాంతంలోని అంగన్‌వాడీ ప్రాంతానికి చెందిన వల్సన్ అనే ఓ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ బాహుబలి కోసం పనిచేస్తున్న స‌మ‌యంలోనే అతడికి అప్పుడే ఈ పాప‌ జన్మించింది. బాహుబలిలో నటించే సమయానికి బేబీ అక్షర వయస్సు కేవలం 18 రోజులు కావడం విశేషం.

bahubali-baby-7

బాహుబలి మొదటి పార్ట్‌లో శివగామి మహేంద్ర బాహుబలి (శివుడు)ని ఎత్తుకుని నదిలో ఉన్నప్పుడు.. ఫ్లాష్ బ్యాక్ సీన్‌లో అమరేంద్ర బాహుబలి పుట్టినప్పుడు… శివగామి చేతి వేలిని పట్టుకున్నప్పుడు… రెండో పార్ట్‌లో ఫ్లాష్ బ్యాక్ కొనసాగుతుండగానే మహేంద్ర బాహుబలిగా శివగామి పసికందును జనాలకు చూపించింది..

bahubali-baby-6కట్టప్ప తన తలపై కాలును పెట్టుకున్నప్పుడు చూపించిన పసికందు అక్షర కావడం విశేషం. దీంతో అత్యంత చిన్న వయస్సులోనే బాహుబలిలో నటించిన యాక్టర్‌గా బేబీ అక్షర గుర్తింపు పొందింది.

- Advertisement -