గ్రీన్ ఛాలెంజ్‌ను స్వీకరించిన బాబా భాస్కర్ మాస్టర్..

149
Baba Bhaske Master
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ శేఖర్ మాస్టర్ ఇచ్చిన ఛాలెంజ్‌ను స్వీకరించి చెన్నైలోని తన నివాసంలో మొక్కలు నాటారు బాబా భాస్కర్ మాస్టర్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన మిత్రుడు శేఖర్ మాస్టర్ ఇచ్చిన ఛాలెంజ్ మేరకు ఈరోజు నా నివాసంలో మొక్కలు నాటడం జరిగింది అని తెలిపారు.

ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చాలా మంచి కార్యక్రమం అని అందరి స్వీకరించి మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ఈ చాలెంజ్‌ను జానీ మాస్టర్ స్వీకరించి మొక్కలు నాటాలని కోరారు. ఈ చాలెంజ్ ఇదే విధంగా ముందుకు కొనసాగాలని బాబా భాస్కర్ మాస్టర్ కోరారు.

- Advertisement -