గ్రీన్ ఛాలెంజ్‌లో పాల్గొన్న దర్శకుడు శేఖర్ కమ్ముల..

255
Director Sekhar Kammula
- Advertisement -

దర్శకుడు శేఖర్ కమ్ముల రాజ్యసభ సభ్యులు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పాల్గొన్నారు. లవ్ స్టోరీ సినిమా షూట్టింగ్‌లో భాగంగా మొయినాబాద్ మండలం, కనకమామిడి గ్రామంలో రహదారికి ఇరువైపులా మొక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎంపీ సంతోష్ కుమార్ పర్యావరణ పరిరక్షణకు ఎంతో కృషి చేస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా మొక్కలు నాటి వాటిని కాపాడే బాధ్యత తీసుకునేలా అవగాహనా కల్పిస్తున్నారు.

ఈరోజు పర్యావరణ ప్రేమికులు మొక్కలు నరకడం తట్టుకోలేక ఎంపీ సంతోష్ కుమార్ గారికి ట్విట్టర్ ద్వారా తెలియజేశారంటే అయన పర్యావరణ ప్రేమికుడిగా ఎంతగా గుర్తింపు పొందారో అర్ధం అవుతుంది. సీఎం కేసీఆర్ గారికి బాసటగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చేపట్టిన ఎంపీ సంతోష్ కుమార్ గారిని ప్రత్యేకంగా అభినందించారు దర్శకుడు శేఖర్ కమ్ముల. లవ్ స్టోరీ చిత్ర యూనిట్ గ్రీన్ ఛాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటాలని కోరారు.

- Advertisement -