బుకింగ్ మొదలైంది.. తల పట్టుకున్న కట్టప్ప

237
- Advertisement -

‘బాహుబలి ది కన్ క్లూజన్’ ఫీవర్ థియేటర్లను తాకింది. నిన్న ఈ చిత్రానికి సెన్సార్ పూర్తయిందని, యూ/ఏ సర్టిఫికెట్ లభించిందని వార్తలు రాగా, ఈ ఉదయం ప్రముఖ సినిమా టికెట్ల విక్రయ సంస్థ ‘బుక్ మై షో’ టికెట్ల ముందస్తు విక్రయాలను ప్రారంభించింది. వెబ్ సైట్ లో 28 నుంచి టికెట్లను ఆఫర్ చేస్తోంది. సినిమా చూడాలనుకుంటున్న రోజు, సమయం, ఏ థియేటర్, టికెట్ రేంజ్, ఎన్ని టికెట్లు కావాలి? వంటి వాటిని ఎంచుకుని డబ్బు చెల్లిస్తే, టికెట్లు ఇస్తామని చెబుతోంది. ఇదే సమయంలో టికెట్లు గ్యారంటీ కాదని, లభ్యతను బట్టి ప్రయత్నిస్తామని, టికెట్ మొత్తంలో తేడా ఉంటే, ఆ డబ్బును వెనక్కు ఇస్తామని షరతులు విధిస్తోంది. ఈ ముందస్తు బుకింగ్ కు కూడా పెద్ద ఎత్తున స్పందన లభిస్తుండటం గమనార్హం. కాగా, ఈ చిత్రం 28న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధమైన సంగతి తెలిసిందే.

Baahubali 2 Movie Tickets Pre-Booking Started

మరి భారీ బడ్జెట్ తో నిర్మితమైన ‘బాహుబలి-2’ సినిమా విడుదలకు సిద్ధమౌతున్న ఈ నేపథ్యంలో ఓ అంశం సినిమా యూనిట్ సభ్యులకు ముచ్చెమటలు పట్టిస్తోంది. కర్ణాటకలోని ఒక్క థియేటర్ లో కూడా ఈ సినిమాను రిలీజ్ చేయనివ్వబోమంటూ కన్నడిగులు తెగేసి చెబుతున్నారు. పదేళ్ల క్రితం కావేరీ జలాల విషయంలో తమిళనాడుకు అనుకూలంగా, కర్ణాటకకు వ్యతిరేకంగా కట్టప్ప పాత్రధారి సత్యరాజ్ వ్యాఖ్యలు చేశారు. దీంతో, కన్నడిగులకు సత్యరాజ్ క్షమాపణ చెబితేనే సినిమాను రిలీజ్ చేయిస్తామని, లేకపోతే అడ్డుకుంటామని ఆందోళనకారులు స్పష్టం చేశారు. ఇప్పటికే కట్టప్ప దిష్టి బొమ్మలను వారు తగలబెడుతున్నారు.

ఈ నేపథ్యంలో కన్నడిగులకు కట్టప్ప సత్యరాజ్ క్షమాపణలు చెప్పినా… ఈ సినిమాకు మరో పెద్ద సమస్య వచ్చి పడుతుంది. కర్ణాటకు సత్యరాజ్ క్షమాపణలు చెబితే, తమిళ తంబీలకు ఆగ్రహం కలుగుతుంది. దీంతో, ఈ సినిమాను తమిళనాడులో ఆడనివ్వబోమంటూ వారు ఆందోళనకు దిగుతారు. దీంతో, సమస్య కర్ణాటక నుంచి తమిళనాడుకు మారుతుంది. ఈ నేపథ్యంలో ఏం చేయాలో అర్థంకాక కట్టప్ప, బాహుబలి యూనిట్ సభ్యులు తలలు పట్టుకుంటున్నారు. ఈ నెల 28న ‘బాహుబలి-2’ విడుదల కాబోతోంది. ఈలోగ అక్కడ పరిస్థితి ఎలా ఉండబోతుందో సినిమా విడుదల వరకు వేచి చూడాల్పిందే మరి

- Advertisement -