అజారుద్దీన్ కొడుకుతో సానియా మిర్జా చెల్లి పెళ్లి..

275
sania_
- Advertisement -

భారత మాజీ క్రికెటర్ అజారుద్దీన్, టెన్నిస్ స్టార్ సానియా మిర్జా భారత క్రీడారంగంలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఇప్పుడు వీరిద్దరి కుటుంబాలకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అజారుద్దీన్ కొడుకు, సానియా మిర్జా చెల్లెలు ఇద్దరూ ప్రేమలో ఉన్నట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. గత కొద్ది రోజులుగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నట్లుగా తెలుస్తుంది. సానియా మిర్జా చెల్లెలు ఆనమ్ 2015లో హైదరబాద్ కు చెందిన ఓ బిజినెస్ మ్యాన్ ను అక్బర్ రషీద్ ను పెళ్లి చేసుకుంది. వీరిద్దరి మధ్య మనస్పర్దలు రావడంతో గత కొద్ది రోజుల నుంచి దూరంగా ఉంటూ వస్తున్నారు.

ఇటివలే వీరిద్దరూ విడాకులకు కూడా దరఖాస్తూ చేసుకున్నారు. అయితే భర్తతో విడాకుల తర్వాత గత కొంతకాలం నుంచి అసద్, ఆనమ్ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నట్టు తెలుస్తుంది. ఫిబ్రవరిలో ఆనమ్ పుట్టిన రోజు సందర్భంగా అసద్ పెట్టిన పోస్ట్ చూస్తే వీరిద్దరి మధ్యలో లవ్ ఏ రేంజ్ లో ఉందో అర్ధమైపోతుంది. నా జీవితంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తికి జన్మదిన శుభాకాంక్షలు అంటూ పోస్ట్ చేశాడు అసద్. తాజాగా వీరిద్దరూ కలిసి దుబాయ్ లొ షాపింగ్ చేస్తున్న ఫోటో సోషల్ మీడియలో వైరల్ గా మారింది.

తాజాగా సానియా కూడా సోషల్ మీడియాలో ఓ ఫొటో పోస్ట్ చేసి పెళ్లి నిజమేనని క్లారిటీ ఇచ్చింది. అసద్‌తో తాను దిగిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన సానియా.. ఆ ఫొటో కింద ఫ్యామిలీ అని క్యాప్షన్‌ పెట్టింది. అసద్ కూడా తన ఇన్‌స్టాగ్రామ్‌లో సానియా, ఆనమ్‌తో కలిసి దిగిన ఫొటోను పోస్ట్ చేశాడు. దానికి ‘ఇద్దరు అద్భుతమైన మహిళలు’ అని క్యాప్షన్ పెట్టాడు. ఇదంతా చూస్తుంటే త్వరలోనే వీరిపెళ్లి జరుగనుందని తెలుస్తుంది.

- Advertisement -