సమాజ్‌వాదీ పార్టీ సీనియర్ నేత ఆజంఖాన్‌కు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. నకిలీ జనన ధ్రువీకరణ పత్రాల కేసులో ఆజంఖాన్‌కు విధించిన శిక్షపై అలహాబాద్ హైకోర్టు స్టే విధించడాన్ని సవాలు చేస్తూ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.
ఈ కేసులో ఆజంఖాన్ శిక్షపై అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన స్టే ఉత్తర్వులను రద్దు చేయాలంటూ యూపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ షీల్ నాగు ధర్మాసనం విచారణ చేపట్టింది.
అదే సమయంలో ఈ కేసులో తమకు కూడా ఇలాంటి ఊరట కల్పించాలని కోరుతూ ఆజంఖాన్ భార్య తజీన్ ఫాత్మా, కుమారుడు అబ్దుల్లా ఆజంఖాన్ దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు అనుమతించింది. దీంతో ఈ కేసులో ఆజంఖాన్ కుటుంబానికి న్యాయపరంగా కీలక ఉపశమనం లభించినట్లయింది.
Also Read:సిద్దిపేటపై రేవంత్ కక్ష సాధింపు!

