హైదరాబాద్లో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన భారత్ సమిట్ పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్ విమర్శించారు. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రానికి ఎలాంటి స్పష్టమైన ప్రయోజనం చేకూరలేదని, ప్రజాధనాన్ని ఖర్చు చేసినప్పటికీ తెలంగాణకు వచ్చిన లాభం ఏమిటో ప్రభుత్వం చెప్పలేకపోతోందని ఆరోపించారు.
భారత్ సమిట్ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం భారీ కార్యక్రమాన్ని నిర్వహించిందని, 70 దేశాల నుంచి అతిథులను ఆహ్వానించిందని రావుల శ్రీధర్ పేర్కొన్నారు. అయితే ఈ సదస్సు ద్వారా రాష్ట్రానికి ఎన్ని పెట్టుబడులు వచ్చాయి? ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు లభించాయి? ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడటానికి ఈ కార్యక్రమం ఏ విధంగా ఉపయోగపడింది? అనే ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ప్రజలకు, రాష్ట్రానికి ప్రయోజనం చేకూర్చే ఫలితాలు లేకుండానే ఈ కార్యక్రమాన్ని నిర్వహించారని విమర్శించారు. భారత్ సమిట్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ ప్రచారానికి, ఆ పార్టీ నేతలకు రాజకీయ మైలేజీ తీసుకురావడానికే ఉపయోగపడిందని ఆరోపించారు.
Also Read:సిద్దిపేటపై రేవంత్ కక్ష సాధింపు!
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం వెనుక రాష్ట్ర ప్రయోజనాల కంటే రాహుల్ గాంధీని సంతృప్తిపరచాలనే ఉద్దేశమే ఎక్కువగా కనిపిస్తోందని రావుల శ్రీధర్ విమర్శించారు. ప్రజాధనంతో నిర్వహించిన ఇంతటి భారీ కార్యక్రమానికి సంబంధించి ప్రభుత్వం వాస్తవ ఫలితాలను వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు.

