ఢిల్లీలో అవార్డులు… గల్లీలో నీచ రాజకీయాలు :సీఎం కేసీఆర్‌

182
- Advertisement -

కేంద్ర మంత్రుల‌పై ముఖ్య‌మంత్రి కేసీఆర్ మ‌రోసారి మండిప‌డ్డారు. వ‌రంగ‌ల్‌లో ప్ర‌తిమ మెడిక‌ల్ కాలేజీ ప్రారంభోత్స‌వం అనంత‌రం అక్క‌డ ఏర్పాటు చేసిన స‌భ‌లో కేసీఆర్ ప్ర‌సంగించారు. బీజేపీ గల్లీ రాజకీయాలు మానుకోవాలని సీఎం కేసీఆర్‌ సూచించారు. రాష్ట్రంలో పథకాలు భేష్‌గా ఉన్నాయని పొగుడుతారని కానీ ఢిల్లీలో అవార్డులు ఇచ్చి…రాష్ట్రంలో చిల్లర రాజకీయాలు చేస్తారని సీఎం కేసీఆర్‌ అన్నారు. రాజ‌కీయాల కోసం కేంద్ర మంత్రులు కేసీఆర్‌ను, మంత్రుల‌ను తిట్టిపోతారు.

ఉద్య‌మ స‌మ‌యంలో చెప్పిన‌వ‌న్నీ ఇవాళ సాకారం అయ్యాయి. తెలంగాణ జీఎస్‌డీపీ ఎక్కువ‌గా ఉంది. ప‌రిశుభ్ర‌త‌, ప‌చ్చ‌ద‌నంతో పాటు అనేక రంగాల్లో ముందంజ‌లో ఉన్నాము. తెలంగాణ ప్ర‌జ‌ల్లో అద్భుత‌మైన చైత‌న్యం ఉంది. అన్ని వ‌ర్గాల‌ ఆకాంక్ష‌ల మేర‌కు ప‌ని చేస్తున్నామ‌ని సీఎం పేర్కొన్నారు.

- Advertisement -