అల్లు శత జయంతి ఉత్సవాలు..స్టూడియోని ప్రారంభించిన:చిరంజీవి

144
- Advertisement -

దివంగత నటుడు అల్లు రామలింగయ్య శత జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకకు అల్లు ఫ్యామిలీతో పాటు చిరంజీవి, ఆయన సతీమణి సురేఖ హాజరయ్యారు. అనంతరం రామలింగయ్య విగ్రహానికి పూల మాలలు వేశారు. నటుడిగా ఈ స్థాయిలో ఉండటానికి కారణం అల్లురామలింగయ్యే అని మెగాస్టార్ చిరంజీవి అన్నారు.

అల్లు రామలింగయ్య శత జయంతి సందర్భంగా అల్లు స్టూడియోని ప్రారంభించడం అదృష్టంగా భావిస్తున్నానని మెగాస్టార్ తెలిపారు. అల్లు రామలింగయ్య వల్ల ఎంతో మందికి ఉపాధి లభించిందని చెప్పారు. అల్లు రామ లింగయ్య వేసిన అడుగులో తాము అందరం నడుస్తున్నామని చెప్పారు. ఈ స్టూడియో లాభాపేక్షకోసం కాకుండా… అల్లూ రామలింగయ్య కృతజ్ఞత కోసమే స్థాపించామని చెప్పారు.

కోకాపేటలో 10 ఎకరాల్లో అల్లు స్టూడియో నిర్మించారు. గతేడాది స్టూడియో నిర్మాణం మొదలు పెట్టగా.. నిర్మాణం పూర్తవ్వడంతో స్డూడియోస్‌ను ఘనంగా ప్రారంభించారు. అత్యాధునిక టెక్నాలజీతో, అన్ని సదుపాయాలు ఈ స్టూడియోలో అందుబాటులో ఉన్నాయి.

- Advertisement -