భారతదేశంలో ఆర్థిక వ్యవస్థ డిజిటల్ ఎకానమీగా మారిన తర్వాత వృద్ధులు తమ వృద్ధాప్య ఫించన్ ఇంటి వద్దే తీసుకుంటున్నారు. అయితే ఇందుకోసం బ్యాంకులకు వెళ్లాల్సిన అవసరం లేకుండా చేయడానికి వచ్చిన ఈ ఆన్‌లైన్ విధానం ద్వారా ప్రతి ఒక్కరూ తమ ఇంటికి దగ్గరలో బ్యాంకు మిత్రాల ద్వారా డబ్బులు జమ చేయవచ్చు అలాగే తీసుకోనవచ్చు. అయితే తాజాగా ఓ హృదయ విదారకరమైన సంఘటన ఒడిశాలో చోటు చేసుకుంది.
Can see the manager of the @TheOfficialSBI responding but yet wish @DFS_India and @TheOfficialSBI take cognisance of this and act humanely. Are they no bank Mitra? @FinMinIndia https://t.co/a9MdVizHim
— Nirmala Sitharaman (@nsitharaman) April 20, 2023
ఏప్రిల్ 17న ఒడిశాలోని నాబ్రంగ్‌పూర్ జిల్లా ఝరిగావ్‌లోని ఓ బ్యాంకు నుంచి ఫించన్ తీసుకునేందుకు 70 యేళ్ల వృద్ధురాలు సుమారుగా 3-4కిలోమీటర్లు చెప్పులు లేకుండా విరిగిపోయిన ప్లాస్టిక్ ఛైర్ సహాయంతో నడుచుకుంటూ వెళ్లి తన ఫించన్ డబ్బు తీసుకుంది. అయితే ప్రస్తుతం దీనికి సంబంధించిన ఈ వీడియో దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. తాజాగా కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఈ వీడియోపై స్పందించింది. దీనిపై స్పందిస్తూ ఝరిగావ్‌లో బ్యాంకులు లేవా.. బ్యాంకు మిత్రాలు ఎందుకు లేరని అని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను అడగ్గా…వెంటనే ఎస్‌బీఐ స్పందించింది.
Also Read: JAMMU:చిన్నారి కలను నెరవేర్చిన మోదీ..!
కేంద్ర మంత్రి ట్విట్‌కు బదులిస్తూ మేడమ్, ఈ వీడియో చూసి మేము కూడా అంతే బాధపడ్డాము. వీడియోలో ఉన్న సూర్య హరిజన్ తన గ్రామంలోని సీఎస్పీ పాయింట్ నుండి ప్రతి నెలా తన వృద్ధాప్య పెన్షన్‌ను తీసుకునేవారు. కానీ వృద్ధాప్యం కారణంగా ఆమె వేలిముద్రలు సీఎస్పీ పాయింట్ వద్ద సరిపోలడం లేదు. ఆమె తన బంధువులతో కలిసి ఝరిగావ్ బ్రాంచ్‌ని సందర్శించింది. మా బ్రాంచ్ మేనేజర్ వెంటనే ఆమె ఖాతాని మాన్యువల్‌గా డెబిట్ చేసి నగదు ఇచ్చారని తెలిపారు. అలాగే సూర్య హరిజన్‌కి వీల్‌ఛైర్‌ను కూడా అందజేయాలని ఎస్బీఐ నిర్ణయించిదని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌కు వివరించారు.
Also Read: UGC:ఇంగ్లీష్‌లో చదివిన తెలుగులో పరీక్షలు..