అవతార్ హిట్ ను మరిపిస్తూ.. 13 ఏళ్ల తరువాత వండర్స్ సృష్టించడానికి వచ్చింది ‘అవతార్-2’. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 160 భాషల్లో సుమారు 55 వేల థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైంది. ఇప్పటికే సినిమా చూసిన వాళ్లంతా.. ఇటువంటి విజువల్ వండర్స్ సృష్టించడం జేమ్స్ కామెరూన్ కి మాత్రమే సాధ్యం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే, కొందరు ఈ సినిమాను చూస్తూ ఎమోషన్స్ ను కంట్రోల్ చేసుకోలేకబోతున్నారు. ఆ భారీ యాక్షన్ విజువల్స్ దెబ్బకి ఈ లోకాన్ని మర్చిపోతున్నారు.
కాగా తాజాగా ఈ సినిమా చూస్తూ ఓ వ్యక్తి చనిపోయిన దురదృష్ట సంఘటన మన తెలుగు రాష్ట్రాల్లో చోటు చేసుకోవడం నిజంగా దారుణం. వివరాల్లోకి వెళ్తే.. కాకినాడ జిల్లాలోని పెద్దాపురంలో ఈ విషాదం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన తమ్ముడితో కలిసి సినిమా చూస్తుండగా మధ్యలో అతనికి గుండెపోటు వచ్చింది. అతనిని హాస్పిటల్ కి తరలించగా అప్పటికే మృతి చెందాడని వైద్యులు తెలిపారు. ఇలా ఆ వ్యక్తి థియేటర్లో అవతార్ 2 సినిమా చూస్తూ మరణించడం ప్రేక్షకులను బాధ పెట్టింది.
మరో వైపు అవతార్ 2 పై నెగిటివ్ కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. జేమ్స్ కామెరూన్ నిర్మించిన అవతార్-2 లో కథ కంటే కూడా.. గ్రాఫిక్స్ ఎక్కువ ఉన్నాయని టాక్ ఉంది. అలాగే అవతార్-2లో కొత్తగా కొత్త అనుభూతి ఏమీ లేదు అని, గతంలో అనేక సినిమాలలో ఇటువంటి సన్నివేశాలను ఇప్పటికే చూసేశాం అని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి…