భారీ బడ్జెట్‌కు…భారీ లాభాల అంచనా

144
- Advertisement -

2009లో వచ్చిన అవతార్ సినిమాకు సీక్వెల్ గా వస్తున్న అవతార్-2 సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయని హాలీవుడ్ టాక్. హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ అద్భుత సృష్టి అవతార్ సినిమాలు. పండోరా అనే కొత్త గ్రహన్ని సృష్టించి అందులో జరిగే యుద్ధ సన్నివేశాలను అద్భుతంగా చిత్రీకరించాడు. దాదాపు 13యేళ్ల తర్వాత పండోరా గ్రహంపై కాకుండా సముద్రంలో గర్భంలో అవతార్‌-2 ను ఆవిష్కరించాడు. డిసెంబర్‌ 16న 160భాషల్లో విడుదల చేయనున్నారు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్‌ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొల్పింది.

హాలీవుడ్ న్యూస్‌ ప్రకారం ఈ చిత్రం బాక్సాఫీస్‌ దగ్గర బ్రేక్‌ ఈవెన్‌ కావాలంటే 2బిలియన్‌ డాలర్లు సాధించాల్సి ఉంటుందని టాక్. అంటే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 16వేల కోట్లకు పైగా కలెక్షన్‌లు సాధించాల్సి ఉంటుంది. ‘అవతార్‌’ సినిమా రీ-రిలీజ్‌తో కలుపుకొని బాక్సాఫీస్‌ దగ్గర దాదాపు 23వేల కోట్లకు పైగా గ్రాస్‌ను కలెక్ట్‌ చేసింది. ప్రస్తుతం సీక్వెల్‌కు ఉన్న క్రేజ్‌తో అవతార్‌-2 16వేల కోట్లు సులవుగా సాధిస్తుందని పలువురు నెటీజన్‌లు అభిప్రాయపడుతున్నారు. అవతార్‌ సినిమాకు దాదాపు 2000 కోట్లకు పైగా బడ్జెట్‌ అయినట్లు టాక్.

ఇవి కూడా చదవండి…

కేజీఎఫ్‌-2కు రికార్డు దగ్గరలో…

అగ్రరాజ్యంలో కాల్పులు..14 మంది మృతి

- Advertisement -