అరుదైన వ్యాధికి గురైన ఖురానా….

90
- Advertisement -

ప్రస్తుత పోటీ ప్రపంచంలో మనషులు ప్రపంచంతో పోటీ పడాలి. దానికి తగ్గట్టుగా ఆహారం వ్యాయామం అలవాట్లు దినచర్యల వంటి వివిధ అంశాల వాటిని మనకు తగ్గట్టుగా ఏర్పాటు చేసుకోవాలి. అయితే కొన్నిసార్లు కొంతమంది కొన్ని అలవాట్లకు అలవాటు పడి మరికొన్నింటిని దూరం చేసుకుంటారు. ప్రముఖ బాలీవుడ్‌ నటుడు ఆయుష్మానా ఖురానా అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్టుగా బాలీవుడ్‌ టాక్.

వెర్టిగో సమస్యతో బాధపడుతున్నట్టుగా ఇటీవలి ఓ కాంక్లేవ్ సందర్భంగా వెల్లడించారు. అయితే ఈ సమస్య తను గత ఆరేళ్లగా ఆనుభవిస్తున్న అని గుర్తు చేసుకోని బాధపడ్డారు. ఈ వ్యాధి వల్ల తాను విపరీతమైన తల తిరుగుతుందని అందువల్లే చాలా సన్నివేశాల చిత్రీకరణను నిలిపివేయాల్సివచ్చేదని తెలిపారు. ఈ సమస్య నుంచి బయటపడేందుకు కొన్ని ప్రత్యేక వ్యాయామాలు చేస్తున్నట్లు వెల్లడించారు.

వెర్టిగో అనగా…
బినైన్ ప్యారోక్సిస్మల్ పొజిషనల్ వెర్టిగో అని అంటారు. ఇన్‌ఫెక్షన్ మెనియర్స్ డిసీజ్ మైగ్రేన్ కారణంగా వెర్టిగో వస్తుంటుంది. దీనివల్ల ఈ ఫీలింగ్ కొద్దిసేపే ఉన్నా చాలా ఇంటెన్సీవ్‌గా ఉంటుంది. వెస్టిబ్యూలర్ నర్వ్‌లో ఉండే వైరల్ ఇన్‌ఫెక్షన్ వల్ల ఇన్‌ఫెక్షన్ వస్తుంది. మైగ్రేన్ వల్ల వెర్టిగో కొన్ని గంటలపాటు ఉంటుంది. చెవి లోపలి భాగంలో ఫ్లూయిడ్ బిల్డప్ అయితే గంటలపాటు వెర్టిగో లక్షణాలు కనిపిస్తాయి.

లక్షణాలు…
డిజీనెస్ పరిసరాలు తిరుగుతున్న ఫీలింగ్ బ్యాలెన్స్ కోల్పోవడం వాంతులు వికారం లక్షణాలు ఉంటాయి. చెవుల్లో రింగుమనే శబ్దం వస్తుంటుంది. ఒత్తడి ఎక్కవైతే స్ట్రోక్స్ వచ్చే ప్రమాదం ఉంది.

నివారణ…

ప్రశాంతంగా ఉండటం ద్వారా సమస్య నుంచి దూరమవ్వచ్చు. ప్రతిరోజు యోగా చేయడం ద్వారా సమస్య నుంచి బయట పడ్డవచ్చు. తల కొద్దిగా ఎత్తుగా పెట్టుకుని పడుకోవాలి. నేలపై ఉన్న వస్తువులను వంగి తీయడం మానుకోవాలి. మెడను ముందుకు చాపకూడదు. వెస్టిబ్యులార్‌ రీహాబిలిటేషన్‌ థెరపీలో వాడే ఎక్సర్‌సైజులు చేయడం ద్వారా ఈ సమస్య నుంచి బయటపడొచ్చు. నిత్యం చేసే పనుల్లో ఉన్నప్పుడు స్పీడ్‌గా తల తిప్పకుండా చూసుకోవాలి.

ఇవి కూడా చదవండి…

బీజేపీకి రెబల్స్ బెడద..

క్లైమాక్స్‌లో వీరమల్లు.?

ట్రెండింగ్‌లో కోలో కోలో

- Advertisement -